Vivo Y300 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? నవంబర్ 21న వివో Y300 ఫోన్ వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు!
Vivo Y300 Launch : వివో వై300 మెటాలిక్ ఫ్రేమ్‌తో కూడిన బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. వివో ఫోన్ మొత్తం డార్క్ పర్పుల్, సీ గ్రీన్ గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది.

Vivo Y300 confirmed to launch in India
Vivo Y300 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త వివో వై300 ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ ఎట్టకేలకు ఫోన్ లాంచ్ తేదీని రిలీజ్ చేసింది. వివో వై300 నవంబర్ 21న లాంచ్ అవుతుందని వెల్లడించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వివో Y300 రెక్ట్యాంగులర్ ఐలాండ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా లెన్స్‌కి దిగువన రింగ్ లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ దిగువన బ్రాండ్ లోగోతో ఉంటుంది.
వివో వై300 మెటాలిక్ ఫ్రేమ్‌తో కూడిన బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. వివో ఫోన్ మొత్తం డార్క్ పర్పుల్, సీ గ్రీన్ గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ వేరియంట్‌ల మార్కెటింగ్ పేర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బ్యాక్ ప్యానెల్ కెమెరా వివరాలను సూచిస్తుంది. వివో వై300 ఫోన్ లో-లైటింగ్ ఫొటోగ్రఫీకి ఆరా లైట్లను కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ డిజైన్ లాంగ్వేజ్ గత ఏడాది వివో వై200 కన్నా భిన్నంగా ఉంటుంది. వివో వై200 ధర రూ. 20వేల కన్నా తక్కువ ఉండగా, రాబోయే వివో Y300 ఫోన్ రూ. 25వేల కన్నా తక్కువ ధర ఉండవచ్చు.
వివో వై300 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
లాంచ్ డేట్, డిజైన్ లాంగ్వేజ్ మినహా కంపెనీ ఇతర వివరాలను రివీల్ చేసింది. ప్రస్తుత వివో వై300 టైటానియం డిజైన్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసిన గత మోడల్ వివో వి40 లైట్ మాదిరిగా ఉంటుంది. వివో వై300 ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1080 x 2400 పిక్సెల్‌ల వద్ద ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
టీజర్ ప్రకారం.. బ్యాక్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ 50ఎంపీ మెయిన్ సెన్సార్, 8ఎంపీ సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రైమరీ కెమెరా సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్‌తో రానుంది. పోర్ట్రెయిట్ షాట్‌లలో అద్భుతంగా ఉంటుంది. సెల్ఫీలకు వివో వై300 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉ ండవచ్చు.
రాబోయే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో పాటు 8జీబీ వరకు ర్యామ్‌తో అందిస్తుంది. ఇంకా, ఫోన్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని చేస్తుందని భావిస్తున్నారు. వివో వై300 వై-ఫై 5, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14లో నిర్మించిన ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతున్న ఈ ఫోన్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. సేఫ్ బయోమెట్రిక్ యాక్సెస్ కోసం అండర్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.