Samsung Galaxy M36
Samsung Galaxy M36 : కొత్త శాంసంగ్ ఫోన్ వస్తోంది.. భారత మార్కెట్లోకి శాంసంగ్ M-సిరీస్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ M36 అతి త్వరలో లాంచ్ కానున్నట్టు (Samsung Galaxy M36) సమాచారం. గత ఏడాదిలో వచ్చిన గెలాక్సీ M35 ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్.. అద్భుతమైన స్పెసిఫికేషన్లతో రానుంది.
అమెజాన్‌లో ఈ ఫోన్ ల్యాండింగ్ పేజీ లైవ్ అయింది. కానీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆ పేజీని తొలగించింది. అధికారిక వివరాలు రివీల్ చేయలేదు. పుకార్లు, నివేదికల ప్రకారం.. స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలను లీక్ అయ్యాయి. రాబోయే శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ పూర్తి వివరాలకు సంబంధించి ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ M36 5G లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
భారత మార్కెట్లో అమెజాన్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ M36 5G లాంచ్ కానుంది. కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లీక్ డేటా ప్రకారం.. వచ్చే జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
గెలాక్సీ M36 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ 1080×2340 రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ఉండొచ్చు. OISతో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 16MP సెన్సార్‌తో రానుంది.
ఎక్సినోస్ 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రావచ్చు. 8GB ర్యామ్, 128GB స్టోరేజీ కలిగి ఉంటుంది. SD కార్డ్ ద్వారా స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M36 ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీతో రానుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత కస్టమ్ యూఐలో రన్ అవుతుంది. టైప్-C USB కనెక్టర్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉండొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M36 5G ధర (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ధర రూ.25వేల లోపు ధర ఉండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ M35 బేస్ వేరియంట్ రూ.19,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రాబోయే ఈ శాంసంగ్ ఫోన్ కనీసం రెండు కలర్ ఆప్షన్లలో రావచ్చు. ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండొచ్చు.