Samsung Galaxy S21 FE : శాంసంగ్ గెలాక్సీ S21 FE ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా..!

Samsung Galaxy S21 FE : శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (S21 FE)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ. 74,999 నుంచి రూ. 39,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు రూ. 35వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Samsung Galaxy S21 FE : శాంసంగ్ గెలాక్సీ S21 FE ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా..!

Samsung Galaxy S21 FE is available at a heavy discount, Know the offers

Updated On : June 12, 2023 / 4:49 PM IST

Samsung Galaxy S21 FE Heavy Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ (Samsung Galaxy S21 FE) స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. శాంసంగ్ అభిమానులకు ఈ డివైజ్ కొనుగోలు చేసేందుకు ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999గా ఉంది. అయితే, ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు కేవలం రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ. 35వేల ఫ్లాట్ డిస్కౌంట్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ S21 FE మోడల్‌పై 46 శాతం తగ్గింపు పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్ ద్వారా అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 37,499కి తగ్గింది. ఈ డీల్‌ను మరింత తగ్గాలంటే శాంసంగ్ గెలాక్సీ S21 FEపై ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ. 35వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా పొందాలంటే.. కేవలం రూ. 2,499కి తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ వాల్యూ ప్రస్తుత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని కొనుగోలుదారులు గమనించాలి.

Read Also : Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!

శాంసంగ్ గెలాక్సీ S21 FE AMOLED ప్యానెల్‌తో 6.4-అంగుళాల FHD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చింది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ డివైజ్ అనేది ఆక్టా-కోర్ ప్రాసెసర్, సూపర్ స్పీడ్ అందిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో రెండు 12MP కెమెరాలు, 8MP కెమెరా ఉన్నాయి. అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. అదనంగా, శాంసంగ్ గెలాక్సీ S21 FE 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 4500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Samsung Galaxy S21 FE is available at a heavy discount, Know the offers

Samsung Galaxy S21 FE is available at a heavy discount, Know the offers

ఆకర్షణీయమైన తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో శాంసంగ్ గెలాక్సీ S21 FE మోడల్ కొనుగోలుదారులకు సరసమైన ధరలో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. అద్భుతమైన డిస్‌ప్లే, ఫుల్ స్టోరేజీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై-క్వాలిటీ కెమెరా సిస్టమ్‌తో సహా టాప్ రేంజ్ స్పెసిఫికేషన్‌లు, ప్రీమియం ఎక్స్ పీరియన్స్ కోరుకునే టెక్ ఔత్సాహికులు, స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది.

శాంసంగ్ గెలాక్సీ S21 FE స్పెసిఫికేషన్‌లు ఇవే :
* 6.4-అంగుళాల FHD AMOLED డిస్‌ప్లే
* 8GB RAM
* 256GB స్టోరేజీ
* ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
* ట్రిపుల్ కెమెరా సెటప్- 12MP రెండు కెమెరాలు, ఒక 8MP కెమెరా
* 32MP ఫ్రంట్ షూటర్
* 4500mAh బ్యాటరీ
* 25W ఫాస్ట్ ఛార్జింగ్

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో ఫోన్లపై ఆఫర్లు.. డోంట్ మిస్!