Samsung Galaxy S22 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలే మిస్ చేసుకోవద్దు..!

Samsung Galaxy S22 Plus : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S22 Plus) వచ్చేసింది.

Samsung Galaxy S22 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలే మిస్ చేసుకోవద్దు..!

Samsung Galaxy S22 Plus gets massive discount on Flipkart, but is it worth buying_

Updated On : December 21, 2022 / 4:27 PM IST

Samsung Galaxy S22 Plus : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S22 Plus) వచ్చేసింది. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌లో (Flipkart)లో ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ S22 ప్లస్ ((Samsung Galaxy S22+) మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ డీల్‌ను మిస్ చేసుకోవద్దు.

శాంసంగ్ Galaxy S22+ 5G ఫోన్ ధర రూ. 85,000 నుంచి రూ. 60వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే మీరు బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో డీల్‌లు సాధారణంగా లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేటెస్టుగా శాంసంగ్ ఫోన్ డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గెలాక్సీ S22+ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22+ మోడల్ రూ. 59,999కి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 84,999కి అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర ఫ్లిప్‌కార్ట్ రూ.25,000 భారీ తగ్గింపును అందిస్తోంది. లిస్టింగ్ ప్రకారం.. వివిధ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందితే.. ధరను రూ. 54,999కి తగ్గిస్తుంది. రూ. 22,500 వరకుఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. తద్వారా మరింత తక్కువ ధరకే పొందవచ్చు.

Samsung Galaxy S22 Plus gets massive discount on Flipkart, but is it worth buying_

Samsung Galaxy S22 Plus gets massive discount on Flipkart

Read Also : Samsung Galaxy S22 : 55 సెకన్లలో శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా 4 సార్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు! 

శాంసంగ్ Galaxy S22+ ఫీచర్లు ఇవే :
శాంసంగ్ గెలాక్సీ S22+ 2022 ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. ప్రస్తుతం చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. అత్యుత్తమ కెమెరాలతో వచ్చిన ఈ శాంసంగ్ గెలాక్సీ S22+ మంచి వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCని కలిగి ఉంది.

వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందించగలదు. గ్రాఫికల్ డిమాండ్ ఉన్న గేమ్‌లను కూడా ఆడవచ్చు. చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నా.. కాస్త లాగ్‌తో స్పీడ్ రన్ అవుతుంది. హుడ్ కింద 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది. శాంసంగ్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. మీరు ఛార్జర్ మాత్రం విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

డిస్‌ప్లేల విషయానికి వస్తే.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు మార్కెట్లో అత్యుత్తమ డిస్‌ప్లేలలో ఒకటిగా ఉన్నాయి. 6.6-అంగుళాల Full-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. కానీ, రిఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hzకి బదులుగా 48W నుంచి 120Hz మధ్య మాత్రమే ఆటోమాటిక్‌గా అవుతుంది. శాంసంగ్ UI చాలా భారీగా ఉన్నందున మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ అదనపు బోనస్ ఏమిటంటే.. IP68-రేటెడ్ తో వచ్చింది. శాంసంగ్ Galaxy S22+ ప్రస్తుత ధరకు కొనుగోలు చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Budget Phones : శాంసంగ్ నుంచి డ్యుయల్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీతో రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?