Samsung Galaxy S24 Ultra : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌లో కొత్త టైటానియం కలర్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఇదిగో!

Samsung Galaxy S24 Ultra : ఈ కొత్త వేరియంట్ బేస్ 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,29,999, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,39,999, 1టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,59,999కు పొందవచ్చు.

Samsung Galaxy S24 Ultra : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌లో కొత్త టైటానియం కలర్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఇదిగో!

Samsung Galaxy S24 Ultra Now Available in India in a New Titanium Colour Option ( Image Source : Google )

Samsung Galaxy S24 Ultra : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా సిరీస్ కొత్త కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్, 200ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గత జనవరిలో దేశంలో ఆవిష్కరించింది.

Read Also : Affordable Electric Car : భారత్‌లో అత్యంత సరసమైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

ఈ ఫోన్ మొత్తం 3 స్టాండర్డ్ టైటానియం-ఆధారిత కలర్‌వేలు, మూడు ఆన్‌లైన్-ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 అల్ట్రాలో శాంసంగ్ టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు ఎస్ పెన్ స్టైలస్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే, గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ ఉన్నాయి.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర :
దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్‌లో ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ బేస్ 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,29,999, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,39,999, 1టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,59,999కు పొందవచ్చు. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఇప్పటికే టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం వైలెట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్, టైటానియం ఆరెంజ్ షేడ్స్‌లో శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
కొత్త షేడ్ కాకుండా గెలాక్సీ S24 అల్ట్రా టైటానియం ఎల్లో వేరియంట్ ఇతర కలర్ ఆప్షన్ల మాదిరిగానే లుక్, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. వన్ యూఐ 6.1తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది. 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను 1Hz–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2,600నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉంది. గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది.

గెలాక్సీ S24 అల్ట్రాలో 200ఎంపీ వైడ్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 50ఎంపీ టెలిఫోటో షూటర్, 10ఎంపీ టెలిఫోటో షూటర్ సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 12ఎంపీ కెమెరాను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో 45డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 15డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్ అందించే ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0కి సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : Oppo A3 Pro Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో A3 ప్రో ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతో తెలుసా?