Affordable Electric Car : భారత్‌లో అత్యంత సరసమైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

Affordable Electric Car : భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీని అందిస్తోంది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 6.99 లక్షలతో మొదలై రూ. 9.53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Affordable Electric Car : భారత్‌లో అత్యంత సరసమైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

Meet India's most affordable electric car ( Image Source : Google )

Updated On : June 21, 2024 / 7:45 PM IST

Affordable Electric Car : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా, మహీంద్రా మోడళ్లలో టాటా టియాగో.ఈవీ, టాటా టైగర్.ఈవీ, టాటా పంచ్.ఈవీ, టాటా నెక్సాన్.ఈవీ, మహీంద్రా XUV400, సిట్రోయెన్ ఇ-సి3 వంటి కొన్ని పాకెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లతో భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది.

Read Also : OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్.. రూ. 20వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సొంతం చేసుకోండి!

ఎంజీ జెడ్ఎస్ ఈవీతో ఈ మోడళ్లన్నీ రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) కన్నా తక్కువ ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే, భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీని అందిస్తోంది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 6.99 లక్షలతో మొదలై రూ. 9.53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ కారు 2024లో (జనవరి నుంచి మే వరకు) 4,493 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

సింగిల్ ఛార్జ్‌తో 230 కి.మీ ప్రయాణిస్తుంది :
గత నెలలో 1,200 యూనిట్ల ఆకట్టుకునే అమ్మకాలను సాధించింది. ఎంజీ కామెట్ ఈవీ 42PS/110ఎన్ఎమ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తుంది. ఐపీ67-రేటెడ్ అయిన 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఎలక్ట్రిక్ కారు 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100శాతం వరకు ఛార్జ్ చేసేందుకు 7 గంటలు పడుతుంది. 7.4kW ఛార్జర్‌తో, 0-100శాతం ఛార్జ్‌ను 3.5 గంటల్లో సాధించవచ్చు. ఎంజీ కామెట్ ఈవీ రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 230 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. ఈ వేరియంట్ వారీగా ఎంజీ కామెట్ ఈవీ ధరలు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

  • ఎగ్జిక్యూటివ్ – రూ. 6.99 లక్షలు
  • ఎక్సైట్ – రూ. 7.98 లక్షలు
  • ఎక్సైట్ ఎఫ్‌సీ – రూ. 8.45 లక్షలు
  • స్పెషల్ – రూ. 9 లక్షలు
  • స్పెషల్ ఎఫ్‌సీ – రూ. 9.37 లక్షలు

ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ పంచ్‌ అందిస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లతో ఫ్రంట్ సైడ్ ప్రకాశవంతమైన ఎంజీ లోగో ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కనెక్టింగ్ లైట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల లెదర్‌తో రోల్ చేసిన స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, టూ-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ కామెట్ ఈవీ 55 కన్నా ఎక్కువ ఫీచర్లను అందించే ఐ-స్మార్ట్ టెక్నాలజీతో వస్తుంది.

Read Also : Infinix Note 40 Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ. 19,999 మాత్రమే..!