Infinix Note 40 Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ. 19,999 మాత్రమే..!

Infinix Note 40 Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ ధర రూ. 19,999కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ధర రూ. 17,999కు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు.

Infinix Note 40 Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ. 19,999 మాత్రమే..!

Infinix Note 40 with wireless charging launched in India ( Image Source : Google )

Infinix Note 40 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త నోట్ 40 ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో లాంచ్ తర్వాత కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 40 ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది.

Read Also : Jio Subscribers : తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు.. కొత్తగా 1.56 లక్షలకు పైగా యూజర్లు..!

ప్రత్యేకమైన ఏఐ వాయిస్-యాక్టివేటెడ్ హాలో లైటింగ్‌తో 108ఎంపీ ట్రిపుల్ కెమెరాను కలిగిన సెగ్మెంట్‌లో మొదటిదిగా చెప్పవచ్చు. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5జీ ప్రాసెసర్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16జీబీ (8జీబీ+8జీబీ) వరకు ఎక్స్‌టెండెడ్ స్టోరేజ్‌తో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఏఐ వాయిస్-యాక్టివేటెడ్ హాలో లైటింగ్‌తో కూడా వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ధర, స్పెసిఫికేషన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ ధర రూ. 19,999కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ధర రూ. 17,999కు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రెండింటితో పాటు ఈ ఫోన్ ధర రూ. 15,999కు పొందవచ్చు. ఈ సేల్ జూన్ 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో నెలకు రూ.1,333 నో-కాస్ట్ ఈఎంఐని కూడా అందిస్తోంది. అలాగే, ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ మ్యాగ్‌ప్యాడ్ ధర రూ. 1,999 విలువైన మ్యాగ్‌కేస్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40.. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఇన్పినిక్స్ నోట్ 40 ఫోన్ రెండు వేర్వేరు టైటాన్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాదు..ర్యామ్ 16జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 40 మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5జీ చిప్‌సెట్‌తో ఆధారితమైనది.

డిస్‌ప్లే : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ 120Hz 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఫోన్ అల్ట్రా-నారో బెజెల్స్‌తో బిగ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ అన్‌లాకింగ్, 1,300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

ఏఐ టెక్ : సరికొత్త ఏఐ టెక్నాలజీతో కెమెరా ప్యానెల్‌లోని యాక్టివ్ హాలో ఫీచర్లు, సెకనులో సూక్ష్మమైన కలర్ ఆప్షన్లను మార్చేలా 256 దశల కంట్రోలింగ్ ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఛార్జింగ్ వంటి వివిధ నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ ప్లే చేయొచ్చు.

కెమెరా : ఇన్ఫినిక్స్ నోట్ 40లో 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ పోర్ట్రెయిట్, సూపర్ నైట్ మోడ్, డ్యూయల్ వీడియో వంటి అనేక ఇతర కెమెరా మోడ్‌లను కలిగి ఉంటుంది. కెమెరా ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు స్కై షాప్, ఏఆర్ షాట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

బ్యాటరీ : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ 5000mAh బ్యాటరీ, 33డబ్ల్యూ మల్టీమోడ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత, స్మార్ట్, హైపర్ ఛార్జింగ్ మధ్య ఎంచుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్ : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ యూజర్లను వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ కోసం మ్యాగ్‌ప్యాడ్, మ్యాగ్‌కేస్ పరిమిత వ్యవధిలో బాక్స్‌లో అందిస్తోంది. మ్యాగ్‌పాడ్ తేలికపాటి, స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. 53 గ్రాముల బరువు, 6.9ఎమ్ఎమ్ మందం కలిగి ఉంటుంది. జింక్ అల్లాయ్ మెటల్‌తో తయారైంది. ఈ ఫోన్ స్లిమ్‌నెస్‌తో మ్యాగ్‌ప్యాడ్‌ మ్యాగ్‌కేస్‌లో మాగ్నెటిక్ కాయిల్ కలిగి ఉంది.

Read Also : OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్.. రూ. 20వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సొంతం చేసుకోండి!