Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ కొనాల్సిన ఫోన్.. భారీగా తగ్గిన గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S24 Ultra :శాంసంగ్ అల్ట్రా ఫోన్ ఆఫర్ అదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 41శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. లాంచ్ అయిన కొన్నేళ్ల తర్వాత కూడా ఈ స్నాప్‌డ్రాగన్-ఆధారిత స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు, ఈ శాంసంగ్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 75వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌తో పాటు ఫోన్ ఫీచర్లు, ఇతర స్పెషిఫికేషన్లపై కూడా ఓసారి లుక్కేద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై 41 శాతం తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ఫస్ట్ రూ. 1,34,999 ధరకు ఉండగా, ఇప్పుడు ధర రూ. 78,999కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. తద్వారా దాదాపు 41శాతం నేరుగా డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ధర మరింత తగ్గాలంటే నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్లపై రూ. 4వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
గెలాక్సీ S24 అల్ట్రా ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. టాప్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 కలిగిన ఈ ఫోన్ శాంసంగ్ 7 భారీ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో పవర్‌ఫుల్ కెమెరా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో 4 బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి OISకి సపోర్టు ఇచ్చే 200MP మెయిన్ కెమెరా కలిగి ఉంది.
OISతో 10MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
మీరు ఈ శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రాసెసర్, కెమెరా సెన్సార్ వంటి లేటెస్ట్ వెర్షన్ అవసరం లేని యూజర్లు అయితే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కొనేసుకోవచ్చు.
లాంగ్ టైమ్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో గెలాక్సీ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఫీచర్ ఈ గెలాక్సీ S24 అల్ట్రాలో లేదు. ధర విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్ ధరకు అందుబాటులో ఉంది.
