అమెజాన్‌లో భారీ తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌.. ఛాన్స్‌ మిస్‌ కావద్దు

అమెజాన్‌లో ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో భారీ తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌.. ఛాన్స్‌ మిస్‌ కావద్దు

Samsung Galaxy S25 Ultra

Updated On : March 31, 2025 / 9:48 PM IST

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. జనవరిలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో అప్పట్లో దీని ధర రూ.1,29,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో డిస్కౌంట్లు, బ్యాంక్‌ ఆఫర్లతో రూ.28,009 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ధర ప్రస్తుతం రూ.1,03,490గా ఉంది. అంటే అప్పట్లో ఉన్న ధర రూ.1,29,999 కంటే ప్రస్తుతం ఉన్న ధర చాలా తక్కువ. అంతేగాక, పలు బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ.1,500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతో ఆ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,02,000 కంటే తక్కువ రేటుకు కొనుక్కోవచ్చు.

మరోవైపు, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్‌ చేస్తే గరిష్ఠంగా రూ.34,800 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అమెజాన్‌లో ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. రూ.5,017 నుంచి ఈఎంఐ స్టార్ట్‌ అవుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రూ.6,999 (ఏడాదికి) కు టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 6.9-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్లో ఉంది. Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఇందులో వాడారు. 12GB వరకు RAM, 1TB స్టోరేజ్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 15ని One UI 7తో నడుస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫొటో షూటర్ ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది.