Upcoming Phones
Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.. 2025 జూన్ చివరి వారంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలల్లో అనేక కొత్త మొబైల్ ఫోన్లు (Upcoming Phones) లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, జూన్ 23 నుంచి జూన్ 30 మధ్యలో మరిన్ని కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ వారం రాబోయే కొత్త ఫోన్లలో శాంసంగ్, వివో, పోకో, ఒప్పో నుంచి అనేక మోడల్స్ రిలీజ్ కానున్నాయి. ఒప్పో K13x నుంచి వివో X200 FE ఫోన్ వరకు స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి..
ఒప్పో K13x లాంచ్ తేదీ.. జూన్ 23 :
భారత మార్కెట్లో ఒప్పో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ K13x లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15వేలు కన్నా తక్కువే. MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫైడ్ ఏరోస్పేస్-గ్రేడ్ AM04 అల్యూమినియంతో వస్తుందని పేర్కొంది. ఈ ఫోన్‌లో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్, స్పాంజ్ షాక్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పోకో F7 లాంచ్ తేదీ జూన్ 24 :
ఈ నెల 24న పోకో F7 భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 12GB ర్యామ్, క్వాల్కమ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 సీపీయూతో వస్తుంది. మొబైల్ గేమింగ్ కోసం 6000mm² వేపర్ కూలింగ్ చాంబర్‌తో 3D ఐస్‌లూప్ సిస్టమ్ కలిగి ఉంది. ఏఐ టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్ కలిగి ఉంది.
పోకో గేమింగ్ ఫోన్ వైల్డ్‌బూస్ట్ 4.0 గేమ్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. పోకో F7 ఫోన్ 7,550mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు భారీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 22.5W రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
వివో T4 లైట్ లాంచ్ తేదీ జూన్ 24 :
వివో T4 లైట్ వెర్షన్ ఈ నెల 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 8GB ర్యామ్, ఎక్స్‌టెండబుల్ ర్యామ్ టెక్నాలజీతో మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ కలిగి ఉంది.
ఈ వివో ఫోన్‌లో స్మార్ట్ ఏఐ ఫీచర్లను కూడా ఉన్నాయి. IP64-రేటెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 1000 నిట్ బ్రైట్‌నెస్‌తో వాటర్‌డ్రాప్ నాచ్ స్క్రీన్ కూడా ఉంది. వివో T4 లైట్ 5G ఫోన్ ఫోటోగ్రఫీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M36 5G లాంచ్ తేదీ జూన్ 27 :
శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూ్స్.. జూన్ 27న భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M36 5G లాంచ్ చేయనుంది. ఈ 5G ఫోన్‌లో భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్‌లో ఫొటోగ్రఫీకి 3 బ్యాక్ కెమెరాలు ఉంటాయి.
8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్, బ్యాక్ ప్యానెల్‌లో 50MP OIS ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ 5G ఫోన్ 13MP సెల్ఫీ కెమెరాకు సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ లేయర్ 4 రెట్లు స్క్రాచ్-రెసిస్టెంట్‌గా ఉండొచ్చునని కంపెనీ పేర్కొంది.
Read Also : OPPO A5 5G Launch : కొత్త ఒప్పో A5 5G వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరా హైలెట్.. ధర జస్ట్ ఎంతంటే?
వివో X200 FE లాంచ్ తేదీ జూన్ 23 :
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ జూన్ 23న తైవాన్‌లో లాంచ్ కానుంది. భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.31-అంగుళాల LTPO అమోల్డ్ స్క్రీన్‌తో రానుంది. ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. 12GB ర్యామ్, మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్‌ను కూడా పొందవచ్చు.
వివో X200 FEలో 50MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ ప్యానెల్‌లో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ వివో 5G ఫోన్ 6,500mAh బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. వివో X200 FE ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది.