ఇకపై SBI ఏటీఎంల్లో OTPతో 24X7 క్యాష్ విత్‌డ్రా…

  • Published By: sreehari ,Published On : September 17, 2020 / 03:00 PM IST
ఇకపై SBI ఏటీఎంల్లో OTPతో 24X7 క్యాష్ విత్‌డ్రా…

Updated On : September 17, 2020 / 5:58 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎస్బీఐ ఏటీఎంల్లో ఓటీపీ ఆధారిత లావాదేవీలు 24X7 చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18, 2020 (శుక్రవారం)  నుంచి 24 గంటల సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఏటీఎం కార్డు ద్వారా సంబంధింత బ్యాంకు ఏటీఎంలో రూ.10 వేలు నుంచి ఆపై క్యాష్ విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది..



2020 జనవరి 1 నుండి వన్-టైమ్ పాస్ వర్డ్ (OTP) విధానాన్ని ఎస్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్బీఐ ఏటిఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తే మాత్రం PIN నెంబర్‌తో పాటుగా OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేస్తే మాత్రం ఖాతాదారుడి మొబైల్ నెంబర్‌కు OTP నెంబర్ వస్తుంది.



ఆ నెంబర్ ఏటీఎంలో ఎంటర్ చేస్తే.. క్యాష్ విత్‌డ్రా చేసుకునే వీలుంది. అయితే OTP ఆధారిత క్యాష్ విత్ డ్రాలకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య (8 AM to 8 PM) మాత్రమే వీలుండేది.. కానీ, ఇప్పుడు ఎస్బీఐ సమయాన్ని మరింత పొడిగించింది. 24×7 విత్ డ్రా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక ఓటీపీ నెంబర్ ద్వారా ఒక విత్‌డ్రా మాత్రమే చేసుకోవచ్చు. మరోసారి విత్‌డ్రా చేయాలంటే మాత్రం కొత్త ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాల్సిందే..
https://10tv.in/discounts-up-to-rs-80000-on-tata-harrier-tiago-and-nexon-in-september-2020/
ఖాతాదారుల భద్రత కోసమే ఎస్బీఐ OTP విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అనాధికారక లావాదేవీలు, కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలు జరగకుండా ఉండేందుకు ఈ భద్రతా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ఎస్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.



ఎస్బీఐ ఖాతాదారులంతా తమ మొబైల్ నెంబర్లను తప్పనిసరిగా తమ అకౌంట్లలో రిజిస్ట్రేషన్ లేదా అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.. అన్ని SBI ఏటీఎంల్లో మాత్రమే OTP ఆధారిత లావాదేవీలు చేసేందుకు అనుమతి ఉందని, ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఈ విధానం వర్తించదని పేర్కొంది.