Scammers AI Songs : ఏఐతో ఫేక్ ఫ్రాంక్ ఓసియన్ సాంగ్స్.. మ్యూజిక్ ట్రాక్‌లను రూ.7 లక్షలకు అమ్మేసిన స్కామర్లు..!

Scammers AI Songs : ఏఐ ఫేక్ ఫ్రాంక్ ఓసియన్ సాంగ్స్ ద్వారా స్కామర్ లక్షలు దండుకున్నాడు. హ్యాండిల్ ‘mourningassasin’ ఫ్రాంక్ ఓషన్ హైక్వాలిటీ వాయిస్ స్నిప్పెట్‌లతో’ మోడల్‌ను ఉపయోగించి ట్రాక్‌లను రూపొందించడానికి ఒక మ్యూజిషియన్‌ను కూడా నియమించుకున్నాడు.

Scammers AI Songs : ఏఐతో ఫేక్ ఫ్రాంక్ ఓసియన్ సాంగ్స్.. మ్యూజిక్ ట్రాక్‌లను రూ.7 లక్షలకు అమ్మేసిన స్కామర్లు..!

Scammer creates fake Frank Ocean songs using AI, makes over Rs 7 lakh by selling them

Updated On : May 14, 2023 / 9:09 AM IST

Scammers AI Songs create fake Frank Ocean songs : ఇటీవల ఏఐ స్కామ్‌లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న AI టెక్నాలజీని ఉపయోగించి దుర్వినియోగ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఇటీవల, ఒక స్కామర్ మ్యూజిక్ రూపొందించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించి మల్టీ ఫేక్ ఫ్రాంక్ ఓషన్ (fake Frank Ocean songs) ట్రాక్‌లను వేల డాలర్లకు విక్రయించడం ద్వారా చాలా డబ్బు సంపాదించాడు. వాస్తవానికి ఈ ట్రాక్‌లు రియల్ కావు. గుర్తుతెలియని అండర్‌గ్రౌండ్ మ్యూజిక్ కమ్యూనిటీకి విక్రయించాడు.

నివేదిక ప్రకారం.. స్కామర్, హ్యాండిల్ ‘mourningassasin’ ద్వారా ఫ్రాంక్ ఓషన్ హైక్వాలిటీ వాయిస్ స్నిప్పెట్‌లతో తయారు చేసిన మోడల్‌ను ఉపయోగించి ట్రాక్‌లను రూపొందించాడు. ఇందుకోసం ఒక సంగీతకారుడిని కూడా నియమించుకున్నాడు. స్కామర్ ట్రాక్‌లను ఫోరమ్‌లోకి లీక్ చేశాడు. అక్కడ ఒక్కొక్కటి 3వేల డాలర్ల నుంచి 4వేల డాలర్లకు విక్రయించారు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 3 లక్షలు అనమాట.. ఫేక్ మ్యూజిక్ విక్రయించడం ద్వారా సుమారు 13వేల డాలర్లు CAD (సుమారు రూ. 7 లక్ష) సంపాదించినట్లు స్కామర్ వెల్లడించాడు. అనేక మంది వ్యక్తులు ప్రైవేట్ మెసేజ్‌లలో ట్రాక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారని స్కామర్ వెల్లడించాడు.

Read Also : Realme 11 Pro Plus : 200MP కెమెరాతో రియల్‌మి 11ప్రో ప్లస్ ఫోన్.. భారత్‌లో మే 16నే లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ ట్రాకులను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని ఆఫర్ చేశారని పేర్కొన్నారు. AI-ప్రొడక్ట్ ఆధారిత మ్యూజిక్ వినడానికి అచ్చం రియల్ మ్యూజిక్ మాదిరిగానే ఉంటుంది. ఎవరూ కూడా ఇది ఫేక్ వాయిస్ ట్రాక్ అని గుర్తించలేనంతంగా రియల్‌గా ఉంటాయి. ఏఐ ద్వారా ఫేక్ ట్రాక్‌లను చాలా సులభంగా క్రియేట్ చేసి ఇలా అక్రమంగా డబ్బులు సంపాదించాడు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో మ్యూజిక్ ఇండస్ట్రీకి భారీగా నష్టం ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఈ ఫేక్ ట్రాక్ కారణంగా అనేక మంది ఆర్టిస్టుల ఆదాయాన్ని దెబ్బతీస్తుంది.

Scammer creates fake Frank Ocean songs using AI, makes over Rs 7 lakh by selling them

Scammers AI Songs create fake Frank Ocean songs using AI, makes over Rs 7 lakh by selling them

AI ఆధారిత మ్యూజిక్ అంతా చీటింగ్ అంటూ విమర్శలు వస్తున్నాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ (Spotify) కృత్రిమ మేధస్సు (AI) మ్యూజిక్ స్టార్టప్ బూమీ నుంచి పదివేల పాటలను తొలగించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. కంపెనీ ఇటీవల 7 శాతం ట్రాక్‌లను తొలగించింది. బూమీ (Boomy) అప్‌లోడ్ చేసిన పదివేల పాటలకు సమానం. AI- ఆధారిత మ్యూజిక్ మోసాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకున్న ఏకైక మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Spotify మాత్రమే కాదు. జనవరి 2023లో, (Apple Music) ప్లాట్‌ఫారమ్ నుంచి ఫేక్ ట్రాక్‌లను గుర్తించి తొలగించడానికి AIని ఉపయోగిస్తుందని ప్రకటించింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికీ AI ఆధారిత మ్యూజిక్ చీటింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది.

Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!