Electric Scooter : ఓలాకు పోటీ ? సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్..ఫీచర్స్ అదుర్స్!
ఈవీ మేకర్ తన ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్’ను తయారు చేసింది. మొదటి దశలో ఒక మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Simple One
Simple One Electric Scooter : ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పోటీ పెరిగిపోతోంది. పలు కంపెనీలు ద్విచక్ర వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమౌతున్నాయి. ఇప్పటికే ‘ఓలా’ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్కూటర్ కు ఉన్న ఫీచర్స్ కు పోటీగా వాహనాలను తయారు చేస్తున్నాయి. తాజాగా…తమిళనాడులోని హోసూర్ లోని ప్లాంట్ లో ఈవీ మేకర్ తన ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్’ను తయారు చేసింది. మొదటి దశలో ఒక మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సింపుల్ వన్ ఈ స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, బ్లూ వంటి నాలుగు రంగుల్లో లభించనుంది. ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీ పడుతోంది.
Read More : Kabul : బతికితే చాలు..జనాలతో నిండిపోయిన కాబుల్ ఎయిర్ పోర్టు
ఫీచర్లు : –
ఆరు కిలోల బరువున్న ఈ స్కూటర్ 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం – అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. డిటాచబుల్, పోర్టబుల్ స్వభావం వల్ల ఇంటి వద్దే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకొనే సౌకర్యం ఉండడం విశేషం. సింపుల్ లూప్ ఛార్జర్ తో 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఛార్జ్ చేసుకొనే అవకాశం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే విధంగా రూపొందించారు.
Read More : Hybrid Tomato : దిగుడితోపాటు, తెగుళ్ళను తట్టుకునే …ఆర్క రక్షక్ హైబ్రిడ్ టొమాటో
2.95 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్ర్పింట్ చేయగలదు. సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 203 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లవచ్చు. 30 లీటర్లబూట్ సామర్థ్యం, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, 12 అంగుళాల వీల్స్, 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఎస్ఓఎస్ సందేశం, డాక్యుమెంట్ స్టోరేజీ, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్ ఉంది.