Upcoming Smartphones : మే 2025లో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు.. ఫుల్ లిస్ట్ ఓసారి లుక్కేయండి..!

Upcoming Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మే 2025లో టాప్ బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఈ జాబితాలో ఏయే ఫోన్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Upcoming Smartphones : మే 2025లో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు.. ఫుల్ లిస్ట్ ఓసారి లుక్కేయండి..!

Upcoming Smartphones

Updated On : April 30, 2025 / 11:57 PM IST

Upcoming Smartphones May 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మే 2025లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. రాబోయే ఫోన్లలో వన్‌ప్లస్, శాంసంగ్, పోకో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉండగా, తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నాయి.

కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ కోసం వన్‌ప్లస్ ఇప్పటికే లాంచ్ ప్లాన్‌లను ధృవీకరించింది. అయితే, శాంసంగ్ కూడా ఐఫోన్ 17 ఎయిర్ పోటీదారు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌తో ప్రీమియంతో రానుంది. మే నెలలో రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ :
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అధికారికంగా లాంచ్ కానుంది. చాలా నివేదికలు ఏప్రిల్‌లో ఉండొచ్చునని చెబుతున్నాయి. కానీ, కంపెనీ ప్లానింగ్ మరోలా ఉంది. వచ్చే మేలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ మే 13న ఉండవచ్చని పుకార్లు ఉన్నాయి. దీనిపై శాంసంగ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

గెలాక్సీ S25 ఎడ్జ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పుకారు ఉంది. కానీ, ఈ శాంసంగ్ ఫోన్ అల్ట్రా-స్లిమ్, తేలికపాటి డిజైన్ కలిగి ఉండొచ్చు. 162 గ్రాముల కన్నా తక్కువ బరువు, కేవలం 5.84 మిమీ మందంతో ఉంటుంది.

హుడ్ కింద, గెలాక్సీ S25 ఎడ్జ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. అయితే, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్లిమ్ డిజైన్ ఉండొచ్చు. ఈ ఫోన్ థిన్ ప్రొఫైల్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 3,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

పోకో F7 :
మే నెలలో ప్రపంచవ్యాప్తంగా పోకో F7 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో కూడా పోకో F7 అల్ట్రాతో పాటు ఈ ఫోన్ లాంచ్ కావచ్చు. కొత్త పోకో F-సిరీస్ ఫోన్ 16GB వరకు ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. హార్డ్-కోర్ పర్ఫార్మెన్స్ అందించనుంది. 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, 90W ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు ఇచ్చే భారీ 7,550mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ IP69 రేటింగ్, డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను పొందే అవకాశం ఉంది.

ఐక్యూ నియో 10 :
ఇటీవలే భారత మార్కెట్లో ఐక్యూ నియో 10Rను లాంచ్ చేసింది. అతి త్వరలో నియో 10 వెర్షన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ వచ్చే నెలలో చైనాలో లాంచ్ కానుంది.

భారత మార్కెట్లో ఐక్యూ నియో 10 మోడల్ కూడా అదే వేరియంట్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం.. ఐక్యూ నియో 10 120W ఛార్జింగ్ స్పీడ్ సపోర్టుతో పాటు భారీ బ్యాటరీ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫోన్ కావచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

రియల్‌మి GT 7 :
వచ్చే మేలో భారత మార్కెట్లో రియల్‌మి GT 7 లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. రియల్‌మి సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్ రాకను ప్రకటించింది. అద్భుతమైన గేమింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)లో 6 గంటల వరకు హై-ఫ్రేమ్-రేట్ గేమ్‌ప్లేను అందిస్తుంది. భారత గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ లేటెస్ట్ లైనప్‌లో రియల్‌మి GT 7 ప్రోలో చేరుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400+ చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0పై రన్ అవుతుంది.

వన్‌ప్లస్ 13s :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s లాంచ్ అవుతుందని అధికారికంగా ధృవీకరించింది. కానీ, నేటికి టైమ్‌లైన్ స్పష్టత లేదు. మే 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. వన్‌ప్లస్ నేరుగా ధృవీకరించనప్పటికీ, భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13Tని వన్‌ప్లస్ 13sగా రీబ్రాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

వన్‌ప్లస్ 13s అనేది వన్‌ప్లస్ 13 సిరీస్‌లో ఇప్పటికే 13R లైనప్‌లో ఉన్న మూడో ఫోన్ అవుతుంది. వన్‌ప్లస్ 13s అనేది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని ధృవీకరించింది. 6.32-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Read Also : Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 250కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

వన్‌ప్లస్ 13s ఫోన్ బ్లాక్, రోజ్ కలర్ ఆప్షన్లలో కూడా లాంచ్ కానుంది. భారత్‌లో వన్‌ప్లస్ 13s ధర రూ. 55వేల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని వన్‌ప్లస్ 13 మోడల్ కన్నా ధర చాలా తక్కువగా ఉంటుంది.