Aadhaar Update : ఇకపై మీ ఇంట్లో కూర్చొనే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు..!

Aadhaar Update : ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలా? ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.

Aadhaar Update : ఇకపై మీ ఇంట్లో కూర్చొనే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు..!

Soon You Will Be Able To Update Aadhaar Details Sitting At Home

Updated On : June 13, 2022 / 7:58 PM IST

Aadhaar Update : ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలా? ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఒక క్షణం ఆగండి.. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఉన్నచోటనే.. ఇంట్లో కూర్చొనే మీ ఆధార్ కార్డులో వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలంటే.. దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి లేదా పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, త్వరలో ఆధార్‌ను కలిగిన ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో సౌకర్యవంతంగా కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది.

ఫోన్ నంబర్ లేదా ఫోటోను అప్‌డేట్ చేసినా, అన్ని ఆధార్ సేవలు త్వరలో ఇంటి వద్దనే పొందవచ్చు. ఈ డోర్‌స్టెప్ ఆధార్ సేవలను పోస్టాఫీసు ద్వారా అందించనున్నట్లు UIDAI వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం UIDAI ప్రస్తుతం 48,000 మంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్‌మెన్‌లకు అవగాహన కల్పిస్తోంది. ఇంటి వద్దనే ఆధార్ సేవను పొందవచ్చు. త్వరలో పోస్ట్‌మెన్‌లు ఉత్తరాలను బట్వాడా చేయడమే కాకుండా మీ ఇంటి వద్దే ఆధార్ సంబంధిత సేవలను కూడా అందిస్తారు.

Soon You Will Be Able To Update Aadhaar Details Sitting At Home (1)

Soon You Will Be Able To Update Aadhaar Details Sitting At Home

ఫోన్ నంబర్‌ను లింక్ చేయడం, ఫోటో అడ్రస్ మార్చడం వంటి ఇతర సేవలతో సహా ఆధార్ సేవలు ఇంటి వద్దనే పొందవచ్చు. నివేదికల ప్రకారం.. మొదటి దశలో, UIDAI ఈ పోస్ట్‌మెన్‌లను ఇంటింటికీ, దేశంలోని దూర ప్రాంతాలకు కూడా వెళ్లడానికి శిక్షణ ఇస్తుంది. రెండవ దశలో.. 1.5 లక్షల మంది పోస్టల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. UIDAI డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఆధారిత ఆధార్ కిట్‌తో సహా తగిన డిజిటల్ డివైజ్‌లతో పోస్ట్‌మెన్‌లను సన్నద్ధం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. వీటితో పోస్ట్‌మెన్‌లు కేవలం కొన్ని క్లిక్‌లతో ఆధార్ యూజర్ల డేటాను అప్‌డేట్ చేయనున్నారు.

డోర్‌స్టెప్ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సాయపడేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దాదాపు 13వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను ఎన్‌రోల్ చేయాలని UIDAI యోచిస్తోందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం.. ఫోన్ నంబర్ వంటి అనేక ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి, మీకు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని లేదా పోస్టాఫీసును సందర్శించాలి.

Read Also : masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వండి