ISRO Success Journey : ఇండియా చరిత్ర సృష్టించిన రోజు.. ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్!
ISRO Success Journey : పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇస్రో. చంద్రయాన్1, చంద్రయాన్2 వైఫల్యం చెందినా కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్3కి శ్రీకారం చుట్టింది.

Special Focus on ISRO Success Journey
ISRO Success Journey : సరిగ్గా ఏడాదికి ముందు.. ఆగస్ట్ 23.. ఈ తేదీని భారత్ ఎప్పటికీ మరిచిపోదు. మన దేశమే కాదు.. అగ్ర దేశాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా గుర్తుపెట్టుకున్న డేట్ ఇది. అంతరిక్షంలో ఇండియా సంచలనం సృష్టించింది. ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యి జాబిల్లిన ముద్దాడిన రోజు ఇది. ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవాంతరాలు.. ఇంకెన్నో వైఫల్యాల తర్వాత చంద్రుడిపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అందుకే ఆగస్ట్ 23ను భారత్.. అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటోంది.
Read Also : Spam Calls : మీకు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా ఇలా అడిగితే అసలు నమ్మొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!
అప్పటి వరకు సినిమా పాటల్లోనూ.. నవలల్లోనూ చందమామ సొగసును వర్ణిస్తుంటే వింటూ, చూస్తూ మురిసిపోయాం. కానీ.. ఇప్పుడు మేమూ జాబిల్లిపై అడుగుపెట్టాం.. అని కాలర్ ఎగరేసేటంత విజయ గర్వం మన దేశానిది. అవును.. నెలరాజు గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతేడాది జులై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపింది.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇస్రో. చంద్రయాన్1, చంద్రయాన్2 వైఫల్యం చెందినా కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్3కి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన రాకెట్ ఎల్వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది.
ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఆగస్ట్ 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆ తియ్యని జ్ఞాపకాలకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తోంది.
చంద్రయాన్3 సాధించిన విజయం ఇస్రోలోనూ, భావి భారత శాస్త్రవేత్తల్లోనూ కొండంత బలాన్ని అందించింది. ఇండియా మరిన్ని అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించేందుకు మార్గం సుగమం చేసింది. చంద్రయాన్3 సక్సెస్ అయిన వెంటనే అంతే దూకుడుతో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్1ను ప్రయోగించి విజయాన్ని ముద్దాడింది ఇస్రో. అటు భూ ఉపరితల పరిశోధన, ఇటు అంతరిక్షంలో చంద్రుడు, సూర్యుడు ఇతర గ్రహాలపై పరిశీలనలకు దిగి అగ్రదేశాల సరసన పోటీ పడుతూ ముందుకెళ్తోంది భారత్.
చంద్రయాన్-3 ఇచ్చిన ఊపుతో చంద్రయాన్-4, చంద్రయాన్-5 కి కూడా శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది ఇస్రో. అలాగే భారత్, జపాన్ చేపట్టే సంయుక్త మిషన్ ద్వారా చంద్రుడిపైకి ప్రజ్ఞాన్ కంటే పెద్ద రోవర్‌ను పంపేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయిట్ నుంచి శాంపిల్స్ సేకరించే ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అటు అంగారకుడు,శుక్రుడు ఇతర గ్రహాల గుట్టు విప్పేందుకు పట్టు వదలకుండా వరుసగా మిషన్స్‌ను ప్లాన్ చేస్తోంది.