Bharti Airtel : అసలే పన్నులెక్కువ.. టారిఫ్స్ పెంచేందుకు వెనుకాడేది లేదు!

టెలికం ఇండస్ట్రీ మనుగడ కోసం అవసరమైతే మొబైల్‌ టెలికాం చార్జీలు పెంచేందుకు వెనుకాడమని మిట్టల్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితులు వస్తే తప్పక చార్జీలను పెంచుతామన్నారు.

Bharti Airtel raising tariffs : దేశీయ టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేని అధిక పన్నులు, సుంకాలు భారత్‌లోనే ఉన్నాయని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పన్ను విధానాల కారణమని మిట్టల్‌ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లతో ఆయన కాన్ఫెరెన్స్‌కాల్‌లో మాట్లాడుతూ.. తాము సంపాదించే రూ.100లో రూ.35 ప్రభుత్వమే తీసుకుంటున్నదని అన్నారు. ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ చెల్లింపులు అధికంగా ఉండటంతో కంపెనీల రుణభారం పెరిగిందని చెప్పారు. టెలికాం ఇండస్ట్రీ పరమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే దిశగా యోచన చేయాలని మిట్టల్ కోరారు. అప్పుడే టెలికాం ఇండస్ట్రీపై ప్రభుత్వం వేసిన భారం తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశంలో 5G టెలికాం సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సునీల్‌ మిట్టల్‌ తెలిపారు.

వచ్చే ఏడాదిలో 5G స్పెక్ట్రం వేలం :
వచ్చే ఏడాది ప్రారంభంలో 5G స్పెక్ట్రం వేలం జరుగుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ద్వితీయార్థంలో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.21వేల కోట్ల సమీకరించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోందని తెలిపారు. 5G సర్వీసులకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభించిందన్నారు. 5G, ఫైబర్‌, డేటా సెంటర్‌ వ్యాపారాల్లోకి పెట్టుబడుల్ని మళ్లీస్తామని వెల్లడించారు. రూ.535 ధరతో రైట్స్‌ ఇష్యూ జారీ ద్వారా రూ.21వేల కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనలకు ఎయిర్‌టెల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్వెస్టర్లు అవసరం లేని ప్రతి 14 ఈక్విటీ షేర్లకు ఒక్కో ఈక్విటీ షేరు రైట్స్‌ ప్రాతిపదికన పొందే అవకాశం లభిస్తుంది.
Petrol : 3 వేల పెట్రోల్ బంక్‌లు క్లోజ్, వాహనదారుల కష్టాలు

ఇండస్ట్రీ మనుగడ కోసం దేనికైనా రెడీ :
టెలికం ఇండస్ట్రీ మనుగడ కోసం అవసరమైతే మొబైల్‌ టెలికాం చార్జీలు పెంచేందుకు వెనుకాడమని మిట్టల్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితులు వస్తే తప్పక చార్జీలను పెంచుతామన్నారు. నెలకు సగటున 16GBల డేటా వినియోగదారులు వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టెలికం రంగం మనుగడకు టారీఫ్‌లు పెంచాల్సిన సమయం ఇదేనని మిట్టల్‌ తెలిపారు. ఇప్పటికీ చాలామంది యూజర్లు రూ.100 ధరతో కొంత డేటా మాత్రమే వాడుతున్నారని అన్నారు. మరికొంతమంది అయితే రూ.600 నుంచి 800 వరకు పలు డేటా సర్వీసులు పొందుతున్నారని చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇంత తక్కువ టారీఫ్‌ లేదన్నారు. టెక్నాలజీని విస్తరణ, నెట్‌వర్క్‌ పెంపునుకు మూలధనంపై తగినంత రాబడి ఉంటేనే సాధ్యపడుతుందని చెప్పారు. అందుకే బేస్‌ టారీఫ్‌ను రూ.79కు పెంచినట్టు తెలిపారు. తర్వాతి రోజుల్లో రూ.99కు పెంచనున్నట్టు మిట్టల్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.200 APRU సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రానురాను దాన్ని రూ.300 వరకు పెంచాలనే యోచనలో ఉన్నామని మిట్టల్ అభిప్రాయపడ్డారు.
TVS : అపాచీ 2021 ఆర్ఆర్ 310, న్యూ లుక్..ధర ఎంతో తెలుసా ?

ట్రెండింగ్ వార్తలు