TVS : అపాచీ 2021 ఆర్ఆర్ 310, న్యూ లుక్..ధర ఎంతో తెలుసా ?

‘టీవీఎస్ అపాచీ 2021’ ఆర్ఆర్ 310ను లాంఛ్ చేసింది. గత సంవత్సరమే మార్కెట్ లోకి వచ్చిన దీనికి కొన్ని మార్పులు చేసి..అదనపు ఫీచర్లు జత చేసి మార్కెట్ లో రిలీజ్ చేశారు.

TVS : అపాచీ 2021 ఆర్ఆర్ 310, న్యూ లుక్..ధర ఎంతో తెలుసా ?

Tvs

Updated On : August 31, 2021 / 9:11 AM IST

TVS Apache RR 310 : దేశీయ మార్కెట్ లలో పలు కంపెనీలు వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వివిధ ఫీచర్లు, రంగు రంగుల ద్విచక్ర వాహనాలను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలలో ఒకటైన ‘టీవీఎస్ అపాచీ 2021’ ఆర్ఆర్ 310ను లాంఛ్ చేసింది. గత సంవత్సరమే మార్కెట్ లోకి వచ్చిన దీనికి కొన్ని మార్పులు చేసి..అదనపు ఫీచర్లు జత చేసి మార్కెట్ లోకి వదిలారు.

Read More : Yamaha EV Vehicles : భారతమార్కెట్లోకి యమహా ఈవీ వాహనాలు…ఎప్పుడంటే..

Tvs Apa

ఇది సరికొత్త బైక్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఈ బైక్ ను తయారు చేయడం జరిగిందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. టీవీఎస్ కొత్త బైక్ ధరను రూ. 2.59 లక్షలుగా నిర్ధారించింది. న్యూ ఆర్ఆర్ 310ను వివిధ ఫెర్మామెన్స్, కిట్స్, ఇతర కస్టమైజేషన్ ఆప్షన్స్ తో కస్టమర్లు పొందే వెసులుబాటును కల్పించారు.

ఇది కంపెనీ జీటీఓ (GTO, బిల్డ్ టూ ఆర్డర్) ప్లాట్ ఫాంపై అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ అపాచీ RR 310 అంతకుముందు..మోడల్ లాగే కనిపించినా…టీవీఎస్ రేసింగ్ బ్యాడ్జ్ ఆప్షన్ ను కలిగి ఉంది. రెడ్, బ్లూ, వైట్ కలర్స్ లు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జాస్ట్ నోట్, బెటర్ లీన్ యాంగిల్స్, న్యూ రేస్ మఫ్లర్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. డైనమిక్, రేస్ వంటి రెండు ఫెర్మామెన్స్ కిట్స్ తో న్యూ ఆర్ఆర్ 310 అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.