బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే

ట్రెండ్ మారుతోంది. ఇప్పుడంతా ఆన్ లైన్ యాప్స్ దే హవా. లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకొనే వరకు యువత అంతా ఆన్ లైన్ లోనే గడిపేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో చక్కగా నచ్చిన యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం..

  • Published By: sreehari ,Published On : February 13, 2019 / 11:38 AM IST
బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే

ట్రెండ్ మారుతోంది. ఇప్పుడంతా ఆన్ లైన్ యాప్స్ దే హవా. లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకొనే వరకు యువత అంతా ఆన్ లైన్ లోనే గడిపేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో చక్కగా నచ్చిన యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం..

ట్రెండ్ మారుతోంది. ఇప్పుడంతా ఆన్ లైన్ యాప్స్ దే హవా. లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకొనే వరకు యువత అంతా ఆన్ లైన్ లోనే గడిపేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో చక్కగా నచ్చిన యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం.. వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగడం.. తరువాత వాటిని ఇలా షేర్లు చేసేస్తూ గడిపేస్తున్నారు. ఒకవైపు ఆన్ లైన్ గేమ్ పబ్ జి మాయలోపడి పిల్లలు చెడిపోతున్నారంటే.. మరోవైపు టిక్ టాక్ యాప్ రోజురోజుకీ తలనొప్పిగా మారుతోంది. టిక్ టాక్ మాయలోపడి యువత భ్రష్టుపట్టిపోతున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.

పబ్ జీ గోలతోనే సతమతమైపోతుంటే.. ఈ టిక్ టాక్ యాప్ గోలెంటీరా బాబూ అనుకుంటున్నారా? మీరే కాదు.. తమిళనాడు ఇదే మాట అంటోంది. బ్లూ వేల్ గేమ్ తరహాలో ఈ టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయాలని పెద్దఎత్తునా డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఈ టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయమంటున్నారో తెలుసుకుందాం రండి. 
 

టిక్ టాక్ (Tik Tok) మోస్ట్ పాపులర్ మొబైల్ యాప్. ఈ వీడియో యాప్ ను చైనా బైట్ డ్యాన్స్ కంపెనీ రూపొందించింది. 2018లో అత్యధికంగా ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్ లలో డౌన్ లోడ్ చేసుకున్నయాప్స్ లో ఇదొకటి. ఇండియాలో పెద్దసంఖ్యలో టిక్ టాక్ యాప్ ను వాడుతున్నారు. అందులో తమిళనాడు అయితే చెప్పనక్కర్లేదు. టిక్ టాక్ యాప్ లో షార్ట్ సాంగ్, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. దీని పిచ్చిలో పడిన యువత.. గంటలకొద్ది వీడియోలు, సాంగ్ షేరింగ్ చేస్తూ హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. వల్గర్ కంటెంట్ ను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడు నేతలు మండిపడుతున్నారు. అసభ్య కరమైన కంటెంట్ ను షేర్ చేయడం వల్ల.. చిన్నారులు, యువతను తప్పుదోవా పట్టిస్తోందని అంటున్నారు.
 

బ్లూ వేల్ తరహాలో బ్యాన్ చేయిస్తాం 
తమిళ సంస్కృతిని దెబ్బతీయడమే కాకుండా.. శాంతి భద్రతల సమస్యకు కూడా దారితీస్తోందని ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే నేత, నాగపట్నం ఎమ్మెల్యే తమ్మిమన్ అన్సారీ ఈ టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో లేవనెత్తారు. భారతీయుల సంస్కృతిని దిగజార్చేలా ఉందని వాపోయారు. దీనిపై తమిళనాడు సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఎం మనికందన్ అసెంబ్లీలో సమాధానమిస్తూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం టిక్ టాక్ మొబైల్ యాప్ ను బ్యాన్ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. బ్లూ వేల్ గేమ్ తరహాలో ఈ టిక్ టాక్ యాప్ ను కూడా బ్యాన్ చేసేలా కేంద్రాన్ని కోరుతామన్నారు.  

Also Read: పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..

Also Read: ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ

Also Read: ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు