Aadhaar Recovery : మీ ఆధార్ నంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. సింగిల్ కాల్‌తో మీ ఆధార్ ఐడీ తెలుసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Aadhaar Recovery : మీ ఆధార్ నెంబర్ మర్చిపోయారా? ఆందోళన అక్కర్లేదు.. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఈజీగా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవచ్చు..

Aadhaar Recovery
Aadhaar Recovery : మీ ఆధార్ కార్డు పోయిందా? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? ఆధార్ నెంబర్ ఏంటో అసలు గుర్తులేదా? అయితే డోంట్ వర్రీ.. మీ ఆధార్ కార్డు లేకపోయినా మీ ఆధార్ నెంబర్ ఎక్కడికి పోదు. మీరు UIDAI వెబ్‌సైట్, (mAadhaar) యాప్‌ని ఉపయోగించడం ద్వారా లేదా హెల్ప్‌లైన్ 1947కి కాల్ చేయడం ద్వారా మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీని సులభంగా తిరిగి పొందవచ్చు.
నేటి డిజిటల్ యుగంలో ఆధార్ (Aadhaar Recovery) కార్డు ప్రతి చిన్న, పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు తప్పనిసరిగా మారింది. అయితే, మీరు ఎప్పుడైనా మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్ ఐడీని పోగొట్టుకుంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా మీ ఇంటి వద్ద నుంచే మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్ ఐడీని తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ ఆధార్ నంబర్ ఇలా ఈజీగా తిరిగి పొందొచ్చు :
ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా “Retrive EID/UID” ఆప్షన్ క్లిక్ చేయండి. మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ ఆధార్ నంబర్ లేదా ఈఐడీని తిరిగి పొందవచ్చు.
‘mAadhaar’ మొబైల్ యాప్ ఉపయోగించాలి. డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయ్యాక ‘Retrive EID/UID’ ఆప్షన్ ఎంచుకోండి. మీ వివరాలను ఎంటర్ చేసి, OTP ద్వారా నంబర్‌ను పొందండి. లేదంటే.. ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 1947కు కాల్ చేయండి.
ఈ కాల్ సమయంలో మీ లాంగ్వేజీ ఎంచుకుని, మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్ ఐడీని ఎంటర్ చేసి సూచనలను ఫాలో అవ్వండి. ఈ సర్వీసు ఇన్‌స్టంట్ ఐడెంటటీ వెరిఫికేషన్, ఆధార్ నంబర్ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సందర్శించి, బయోమెట్రిక్ ధృవీకరణ తర్వాత పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మొదలైన డాక్యుమెంట్లను చూపించి నంబర్‌ను తిరిగి పొందవచ్చు. ఆధార్ పోయినప్పుడు కూడా ఐడెంటిటీ వెరిఫికేషన్ ద్వారా మీ నెంబర్ తెలుసుకోవచ్చు.