Tech Tips in Telugu _ How to Apply for Voter ID Card Online in telugu,
How to Apply Voter ID Online : ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? అయితే, ఇప్పడే అప్లయ్ చేసుకోండి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఎన్నికల్లో (Elections Schedule 2023) ఓటు వేయగలరని గుర్తుంచుకోండి. ఓటు నమోదు చేసుకున్న ప్రతి భారతీయ ఓటరు భారత ఎన్నికల సంఘం (election commission of india) నుంచి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (How to Apply Voter ID Online)ను అందుకుంటారు.
ప్రతి ఓటరు వారి ఓటర్ ID కార్డ్‌తో పాటు EPIC నంబర్ లేదా ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్‌ను పొందవచ్చు. EPIC నంబర్, అక్షరాలు, అంకెలు రెండింటితో రూపొందించిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్, ఓటరు గుర్తింపు కార్డు ముందుభాగంలో కనిపిస్తాయి. మునిసిపల్, స్టేట్, ఫెడరల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ఓటర్ ఐడీ కార్డు చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి ఓటరు వ్యక్తిగత గుర్తింపుగా పనిచేస్తుంది.
కొత్త ఓటరు ఐడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా.. ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల సంఘం (ECI) అధికారిక వెబ్‌సైట్ (eci.gov.in) హోంపేజీని విజిట్ చేయండి. భారత్‌లో ఎన్నికల ప్రక్రియ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిది అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఎన్నికల జాబితా నుంచి దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల షెడ్యూల్(Telangana Elections Schedule 2023)ల వరకు అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల కోసం మార్గదర్శకాల జాబితా, ఓటు నమోదు కోసం వివిధ దరఖాస్తు ఫారమ్‌లను కూడా కలిగి ఉంది.
Read Also : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!
మీరు పొందాలనుకుంటున్న సర్వీసు ఆధారంగా అనేక ఫారమ్‌లు ఉన్నాయి. ఇందులో ఓటర్ ఐడీలో పేరు మార్పు, ఓటర్ల జాబితాలో పేరు చేర్చడం, అలాగే విదేశాలలో నివసించే వారికి, సాయుధ దళాల సభ్యులకు, ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి ప్రత్యేక ఫారమ్‌లు మొదలగునవి ఉన్నాయి. మీరు కొత్త ఓటరు దరఖాస్తు కోసం ఫారమ్ 6ని ఎంచుకోవాలి. ఈ ఫారమ్ కోసం మీరు జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్‌ని విజిట్ చేయాలి. మీరు భారతదేశ నివాసి అయితే ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవడానికి ‘ Forms‘ కింద ఫారమ్ 6 (Form 6) ని డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా ఫారమ్ 6పై Click చేయండి.
Tech Tips in Telugu: How to Apply for Voter ID Card
1. ఓటర్ల సర్వీసు పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in)ను విజిట్ చేయండి.
2. అందులో ‘Forms’ కింద ‘Fill Form 6‘పై క్లిక్ చేయండి’ లేదా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, Printout తీసుకోండి. భారత నివాసి అయితే ఫారం 6 నింపండి. మీరు ఎన్నారై (NRI) అయితే ‘Form 6A‘పై Click చేయండి.
3. మీరు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేస్తే.. ‘Sign-Up‘ బటన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, ఇతర ముఖ్యమైన వివరాలను అందించి నమోదు చేసుకోండి.
4. మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా EPIC నంబర్‌ని అందించి, పాస్‌వర్డ్, క్యాప్చాతో పాటు ‘Request OTP‘పై క్లిక్ చేయండి. 5. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్ చేసి, పోర్టల్‌కి లాగిన్ చేయండి.
6. మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
7. ‘Submit‘పై Click చేయండి.
8. ఆ తర్వాత మీ ఇమెయిల్ అడ్రస్‌కు ఇమెయిల్‌ను అందుకుంటారు. ఈ ఇమెయిల్‌లో పర్సనల్ ఓటర్ ID పేజీకి లింక్ ఉంటుంది. మీరు ఈ పేజీ ద్వారా మీ ఓటరు ID అప్లికేషన్‌ను ట్రాక్ చేయొచ్చు. మీ దరఖాస్తు నుంచి ఒక నెలలో మీ ఓటర్ ID కార్డ్‌ని ఇంటి వద్ద అందుకుంటారు.
ఓటరు కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇవే :
ఆన్‌లైన్‌లో ఓటర్ ID కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
* ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో
* ఐడెంటిటీ ప్రూఫ్.. జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా హైస్కూల్ మార్క్ షీట్
* అడ్రస్ ప్రూఫ్ – రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ లేదా యుటిలిటీ బిల్లు (ఫోన్ లేదా కరెంట్ బిల్లు)
ఓటరు గుర్తింపు కార్డు అర్హత :
ఓటరు ID కార్డ్ కోసం అర్హత ప్రమాణాలు ఇలా ఉండాలి.
* దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి.
* దరఖాస్తుదారు తప్పనిసరిగా పర్మినెంట్ రెసిడెన్స్ అడ్రస్ కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
How to Apply for Voter ID Card Online
పాత ఓటరు కార్డు నుంచి కొత్తదానికి మారే ప్రక్రియ :
పాత ఓటరు గుర్తింపు కార్డు నుంచి కొత్తదానికి మారే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
1. అధికారిక జాతీయ ఓటర్ల సర్వీసు (www.nvsp.in) పోర్టల్‌ని విజిట్ చేయండి.
2. హోమ్‌పేజీలో ‘e-PIC Download‘ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మీరు కొత్త వెబ్‌పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
4. మీ EPIC నంబర్ లేదా ఫారమ్ రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
5. మీ రెసిడెంట్ స్టేటస్ ఎంచుకోవాలి.
6. ‘Search’ బటన్‌పై Click చేయండి.
7. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు.
8. నిర్ణీత ఫీల్డ్‌లో OTPని ఎంటర్ చేయండి. వెరిఫై చేయండి.
9. ‘Download e-PIC‘ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
ఓటరు గుర్తింపు కార్డు వెరిఫికేషన్ :
ఓటరు గుర్తింపు కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ కింది విధంగా పాటించండి.
1. అధికారిక జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్‌ని విజిట్ చేయండి.
2. ‘Search in Electoral Roll’ ఆప్షన్ ఎంచుకోండి.
3. అవసరమైన వివరాలతో ఫారమ్‌ను నింపి వాటిని వెరిఫై చేసుకోండి.
Read Also : Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటాను ఎలా తొలగించాలో తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!