Tecno Pova 5 Pro Launch : నథింగ్ ఫోన్ 2 డిజైన్‌తో టెక్నో Pova 5 ప్రో ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
Tecno Pova 5 Pro Launch : టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్లలో Pova 5, Pova 5 Pro భారత ధరలను కంపెనీ నిర్ధారించింది. ఈ బేస్ మోడల్ రూ. 11,999 నుంచి ప్రో మోడల్ రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది.

Tecno Pova 5 Pro with Nothing Phone 2 inspired design launched in India
Tecno Pova 5 Pro Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో (Tecno) కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Pova 5, Pova 5 Pro ధరలను అధికారికంగా ధృవీకరించింది. ఈ రెండు ఫోన్‌లు గత వారమే ఆవిష్కరించింది. కంపెనీ Pova 5, Pova 5 Pro ధరలను ప్రకటించింది. ధర విషయానికొస్తే.. Tecno Pova 5 ప్రారంభ ధర రూ. 11,999, ప్రో మోడల్ ధర రూ. 14,999కు అందుబాటులో ఉంది. టెక్నో Pova 5 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే ఒక మోడల్‌లో లాంచ్ చేయనుందని గమనించాలి. ఈ మోడల్ ధర రూ.11,999కు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ హరికేన్ బ్లూ, మెచా బ్లాక్, అంబర్ గోల్డ్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
టెక్నో Pova 5 Pro రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 14,999, 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 15,999కు పొందవచ్చు. సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్యూజన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, స్మార్ట్‌ఫోన్ తయారీదారు మీకు రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. అదనంగా, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. Tecno Pova 5, Pova 5 Pro రెండూ ఆగస్ట్ 22 నుంచి అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయని కూడా గమనించాలి.

Tecno Pova 5 Pro Launch with Nothing Phone 2 inspired design launched in India
టెక్నో Pova 5 ప్రో డిజైన్, నథింగ్ ఫోన్ (2)తో సమానమైన ఫీచర్లతో వస్తుంది. కొత్త Tecno ఫోన్‌లో గేమింగ్, ఇన్‌కమింగ్ కాల్‌లు, నోటిఫికేషన్‌లు, తక్కువ బ్యాటరీ హెచ్చరికలతో సహా వివిధ దృశ్యాలకు కస్టమైజడ్ LED లైట్లు వెనుకవైపు ఉన్నాయి. బేస్ మోడల్, అకా టెక్నో Pova 5, వెనుకవైపు LED లైట్లను కలిగి ఉండదు. అయితే, ఇది పరిశ్రమలో ఫస్ట్ ‘3D టర్బో మెచా’ ప్యానెల్‌ను అందిస్తుంది.
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Pova 5 ఫోన్ 6.78-అంగుళాల FHD+ 120Hz డిస్ప్లేతో వచ్చింది. MediaTek Helio G99 6nm చిప్‌సెట్, 50MP AI డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6,000mAh వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది. 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. మరోవైపు, ప్రో మోడల్‌లో 6.78-అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే, Mediatek డైమెన్సిటీ 6080 SoC, 50MP AI డ్యూయల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000mAh 68W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి.