Tecno Spark 20 Launch : డైనమిక్ పోర్ట్‌తో టెక్నో స్పార్క్ 20 ఫోన్ లాంచ్.. ఈ లేటెస్ట్ బడ్జెట్ మోడల్ ధర ఎంతంటే?
Tecno Spark 20 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? డైనమిక్ పోర్ట్‌తో టెక్నో నుంచి సరికొత్త బడ్జెట్ మోడల్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ85 ఎస్ఓసీతో వచ్చింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చెక్ చేయండి.

Tecno Spark 20 With MediaTek Helio G85 SoC, 'Dynamic Port' Launched
Tecno Spark 20 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. స్పార్క్ 20 అనేది స్పార్క్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో కంపెనీ లేటెస్ట్ బడ్జెట్ మోడల్ అని చెప్పవచ్చు. గత నవంబర్ 2023లో టెక్నో స్పార్క్ గో 2024 ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత వస్తుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్‌తో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13పై ఆధారపడిన హెచ్ఐఓఎస్ 13పై రన్ అవుతుంది.
ఈ ఫోన్ 720పీ రిజల్యూషన్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. టెక్నో స్పార్క్ 20 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. టెక్నో స్పార్క్ 20 ధర ఇంకా ప్రకటించలేదు. కంపెనీ వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను లిస్టు చేసింది. అయితే, ఈ ఫీచర్లలో హ్యాండ్‌సెట్ సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ 2.0 (బ్లూ), నియాన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
టెక్నో స్పార్క్ 20 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (నానో) టెక్నో స్పార్క్ 20 ఆండ్రాయిడ్ 13-ఆధారిత హెచఐఓఎస్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల హెచ్‌డీప్లస్ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. కంపెనీ ‘డైనమిక్ పోర్ట్’ని కూడా కలిగి ఉంది.

Tecno Spark 20 Launch
సెల్ఫీ కెమెరా కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లు, ఇతర డివైజ్ స్టేటస్ సంబంధించిన సమాచారాన్ని చూపే సాఫ్ట్‌వేర్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ వరకు ర్యామ్‌తో మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌తో నడుస్తుంది. కంపెనీ టెక్నో స్పార్క్ 20ని 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యూయల్ ఫ్లాష్‌తో సెకండరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు హ్యాండ్‌సెట్ 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. రెండు ఎల్ఈడీ ఫ్లాష్‌లతో వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా మరింత విస్తరించవచ్చు. టెక్నో స్పార్క్ 20లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
యాక్సిలెరోమీటర్, ఇ-కంపాస్, వర్చువల్ గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 163.69 x 75.6 x 8.45 మిమీ పరిమాణం ఉంటుంది.
Read Also : Apple Watch Series 9 : ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌వాచ్ ఇదిగో.. రెడ్ కలర్ వాచ్ సిరీస్ 9 చూశారా? ధర ఎంతంటే?