యాక్సిడెంట్లు అవడానికి కారులో ఈ 5 మెయిన్ పార్ట్‌లే కారణం. చెక్ చేసుకున్నారా?

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 09:49 AM IST
యాక్సిడెంట్లు అవడానికి కారులో ఈ 5 మెయిన్ పార్ట్‌లే కారణం. చెక్ చేసుకున్నారా?

Updated On : August 21, 2020 / 6:19 PM IST

మద్యం తాగి కారు నడపడం లాంటివి కాకుండా కార్ యాక్సిడెంట్ అవడానికి ప్రధాన కారణాలు ఈ ఐదేనని చెప్పొచ్చు. వీటిని ముందే పసిగట్టి జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాల నుంచి ముందే కాపాడుకోగలం.

బ్రేక్‌లలో వైఫల్యం: 
ముందు చూసుకోవాలసింది బ్రేక్‌లు. వాటిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా ప్రమాదమే. కానీ, ఇవే పదేపదే సమస్యగా మారతాయి. లండన్‌లో సంవత్సరానికి 630యాక్సిడెంట్లు జరిగాయి. ఈ బ్రేక్‌లు ఫెయిలవడానికి కారణాలు పాడ్స్, డిస్క్‌లు, బ్రేక్‌లకు వాడే ఫ్లూయిడ్. ఏదో ప్రొఫెషనల్ కు చూపించి సలహా తెలుసుకునే కంటే మనమే వాటిని పసిగట్టగలం.

టైర్లకు రంధ్రాలు:
యాక్సిడెంట్లు అవడానికి బ్రేక్ ఫెయిల్ తర్వాత ఛాన్స్ టైర్లలో సమస్య రావడమే. అరిగిపోయిన టైర్లు కానీ, రంధ్రాలు ఉన్న టైర్లు కానీ వాహనానికి ఉంటే బ్రేక్ వేసినా.. లేదా డైరక్షన్ మార్చాలనుకున్నా వేగంలో ఉన్నప్పుడు వాహనాలు మన మాట వినవు. ఈ కారణంగా సంవత్సరానికి 550ప్రమాదాలు జరుగుతున్నాయనేది వాస్తవం. టైర్లలో గ్రిప్ అనేది చాలా కీలకం.

సేఫ్ సైడ్ కోసం టైర్లు కచ్చితంగా 1.6మి.మీల లోతుగా ఉండాలి. దాంతో పాటు రిమ్‌కు టైర్ బయటకు వస్తున్నట్లుగా ఉండాలి. కరెక్ట్‌గా రిమ్ ఎత్తులో ఉన్నా సమస్యే. అలా లేకపోతే వెంటనే మీ టైర్లను రిప్లేస్ చేసుకోండి.

స్టీరింగ్ చెక్ చేసుకోండి:
బ్రేక్… టైర్లు బాగున్నప్పటికీ స్టీరింగ్ అనేదే కీలకం. వేగాన్ని నియంత్రించడానికి బ్రేక్‌లు అవసరమపడితే.. వాహన దిశను  అదుపు చేయడానికి స్టీరింగ్ ఆధారం. ఊగుతూ ఉన్న స్టీరింగ్ కానీ, కష్టంగా తిరుగుతున్నట్లు గానీ ఉంటే వెంటనే చెక్ చేసుకోవడం మంచిది.

స్టీరింగ్ తిప్పుతుంటే వింత శబ్దాలు అంతర్లీనంగా పాడవుతుందని అనడానికి సందేహాలు. అలాంటప్పుడు మీ పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్‌ను చెక్ చేయండి. లేదా ఇతర మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలుసుకోండి.

లైట్లు.. ఇండికేటర్లు:
రాంగ్ కనెక్షన్‌తో లైట్లు వెలగడం.. ఇండికేటర్లు వెలిగి ఆరిపోతుండటం వంటివి జరుగుతుంటే ముందే అలర్ట్ అవ్వాలి. చాలా కార్లలో బల్బులు రీప్లేస్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఒక వేళ బల్బుల్లో ఎటువంటి సమస్య లేదంటే వైరింగ్ లో తేడాలు ఉండొచ్చు. ఇది చాలా పెద్ద సమస్య సరైన సమయానికి ఇండికేటర్ పని చేయకపోతే  ప్రయాణిస్తున్న సమయంలో పక్క వాహనాలతో కమ్యూనికేషన్ చేయలేం.

పగిలిన లేదా విరిగిన అద్దాలు:
యాక్సిడెంట్లు జరగడానికి కారకాలలో చివరిది.. అద్దాలు. పగిలి ఉన్న అద్దాలు వెనుక వచ్చే వాహనాలను సరిగా చూపించకపోవడంతో ముందున్న కార్‌ను ఢీకొని ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. బేసిక్ మెయింటైనెన్స్ చూసుకుంటే కారును ప్రమాదాల నుంచి తప్పించగలం. ఏ చిన్న సమస్య వచ్చినా త్వరగా సెట్ చేసుకోలేకపోతే.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేం కదా.