Ola electric Scooter : హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా కన్నా చౌకైన ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 95కి.మీ టాప్ రేంజ్..!

Ola electric Scooter : అత్యధికంగా అమ్ముడవుతున్న అంతర్గత దహన ఇంజిన్ (ICE)తో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా వంటి మోడల్స్ కన్నా చౌకైన ధరకే అందుబాటులో ఉంది.

Ola electric Scooter : హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా కన్నా చౌకైన ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 95కి.మీ టాప్ రేంజ్..!

This Ola electric scooter cheaper than Hero Splendor, Honda Activa

Ola electric Scooter : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎస్1ఎక్స్ రేంజ్ ధరలపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఓలా స్కూటర్లు ఇప్పుడు రూ. 69,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న అంతర్గత దహన ఇంజిన్ (ICE)తో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా వంటి మోడల్స్ కన్నా చౌకైన ధరకే అందుబాటులో ఉంది.

Read Also : Moto G64 5G Launch : రూ.15వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో G64 5జీ ఫోన్ వచ్చేసింది..!

అందులో, ఎస్1ఎక్స్ అనేది ఓలా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ స్కూటర్. ఎస్1ఎక్స్ 2kWh, ఎస్1ఎక్స్ 3kWh, ఎస్1ఎక్స్ 4kWh వంటి బ్యాటరీ కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి మొత్తం 3 వేరియంట్‌లను కలిగి ఉంది. ఓలా ఎస్1ఎక్స్ 2kWh ఇప్పుడు రూ. 69,999 (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ), ఎస్1ఎక్స్ 3kWh ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్), ఓలా ఎస్1ఎక్స్ 4kWh ధర రూ. 99,999 ఉన్నాయి. ఓలా ఎస్1ఎక్స్ 2kWh, ఓలా ఎస్1ఎక్స్ 4kWh మోడల్ ధరలను రూ. 10వేలు, ఓలా ఎస్1ఎక్స్ 3kWh ధరను రూ. 5వేలు తగ్గించింది.

అత్యంత సరసమైన మోడల్ ఇదే :
హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ ప్రారంభ ధర రూ. 75,441 (ఎక్స్-షోరూమ్), హోండా యాక్టివా స్కూటర్ రూ. 76,234 (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉన్నాయి. అదే ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ కస్టమర్ డెలివరీలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓలా S1ఎక్స్ 2kWh మోడల్ మొత్తం లైనప్‌లో అత్యంత సరసమైన మోడల్ అని చెప్పవచ్చు.

2kWh బ్యాటరీతో 6కిలోవాట్ హబ్ మోటార్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. ఈ స్కూటర్ మొత్తం ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే 3 డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఏఆర్ఏఐ వెరిఫైడ్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై 95కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వాస్తవ పరిధి ఎకో మోడ్‌లో 84 కిలోమీటర్లు ఉండగా.. సాధారణ మోడ్‌లో 71కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఓలా ఎస్1ఎక్స్ 2kWh గంటకు 85కిలోమీటర్ల టాప్ స్పీడ్, గంటకు 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకన్లలో అందుకోగలదు. గంటకు 0 నుంచి 60కిలోమీటర్ల వేగాన్ని 8.1 సెకన్లలో అందుకోగలదు. హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి ఎలక్ట్రిక్ స్కూటర్ 100శాతం ఛార్జ్ చేయాలంటే 5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎస్1ఎక్స్ 2kWh టాప్ ఫీచర్లలో ఎల్ఈడీ లైట్లు, 4.3-అంగుళాల ఎల్‌సీడీ ఐపీ, ఫిజికల్ కీ, క్రూయిజ్ కంట్రోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ డ్యూయల్ షాక్‌లు, ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్ ఉన్నాయి. అన్ని మోడళ్ల కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కిందివిధంగా ఉన్నాయి.

  • ఎస్1ఎక్స్ 2kWh ధర రూ. 69,999
  • ఎస్1ఎక్స్ 3kWh ధర రూ. 84,999
  • ఎస్1ఎక్స్ 4kWh ధర రూ. 99,999
  • ఎస్1ఎక్స్ ప్లస్ ధర రూ. 84,999
  • ఎస్1 ఎయిర్ ధర రూ. 1,04,999
  • ఎస్1 ప్రో ధర రూ. 1,29,999

మొత్తం ఓలా ఎస్1 లైనప్, ఎక్స్ 2kWh నుంచి ప్రో వరకు అదనపు ఖర్చు లేకుండా 8 ఏళ్ల/80వేల కిలోమీటర్ల కాంప్లిమెంటరీ బ్యాటరీ వారంటీతో వస్తుంది. అదనపు వారంటీ కూడా అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు గరిష్ట పరిమితిని రూ. 4,999తో 1,25,000కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. ఓలా 3kW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ యాక్సెసరీని రూ. 29,999 ధరకు కూడా ప్రవేశపెట్టింది. ఇండస్ట్రీ బాడీ, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 30.06శాతం పెరిగాయి.

ఆర్థిక సంవత్సరంలో 7,28,205 యూనిట్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2024లో 9,47,087 యూనిట్ల వరకు పెరిగాయి. ఓలా అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 1,52,791 యూనిట్ల నుంచి ఎఫ్‌వై24లో 115.48శాతం పెరిగి 3,29,237 యూనిట్లకు చేరుకున్నాయి. ఎఫ్‌వై24లో దేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కంపెనీ 34.76శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ కార్యకలాపాల ప్రారంభమైనప్పటి నుంచి 5లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించింది.

Read Also : Moto G64 5G Launch : రూ.15వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో G64 5జీ ఫోన్ వచ్చేసింది..!