TikTok : టిక్‌టాక్ ఇండియాకు తిరిగి వస్తుందా? అదే ప్రయత్నాల్లో యాప్ యాజమాన్యం..!

TikTok : కొన్నాళ్ల క్రితం దేశంలో పాపులర్ అయిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. బైట్ డాన్స్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫారమ్ TikTok యాప్ బ్యాన్ అయింది.

TikTok : కొన్నాళ్ల క్రితం దేశంలో పాపులర్ అయిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. బైట్ డాన్స్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫారమ్ TikTok యాప్ బ్యాన్ అయింది. అప్పట్లో వేలాది మంది  టిక్ టాక్ క్రియేటర్లతో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఈ టిక్ టాక్ చైనాకు సంబంధించిన యాప్ కావడంతో జాతీయ భద్రత సమస్యల దృష్ట్యా భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది. ఎప్పటినుంచో టిక్ టాక్ మళ్లీ ఇండియాకు వస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ యజమానులు ఇండియాలో కొత్త భాగస్వాముల కోసం ప్రయత్నిస్తున్నారు.

ఓ నివేదిక ప్రకారం.. బైటెడెన్స్ ప్రస్తుతం భారత్‌లో వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రీస్టోర్ చేయడానికి హీరానందని గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ముంబై, బెంగుళూరు, చెన్నై అంతటా ప్రాజెక్ట్‌లతో భారత్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో హిరందందానీ గ్రూప్ ఒకటి. రియల్ ఎస్టేట్ దిగ్గజం యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కింద డేటా సెంటర్ కార్యకలాపాలను కూడా రన్ చేస్తోంది. ఇటీవలే టెక్నాలజీ-లీడ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఆర్మ్-తేజ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించింది. నివేదికల ప్రకారం.. ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. దీనిపై ఇంకా అధికారిక చర్చలు లేవుని తెలిపాయి.

Tiktok Coming Back To India Company Seeking Local Partnership 

టిక్ టాక్ యాజమాన్యం ఆమోదం కోసం ప్రయత్నిచినప్పుడు వారి అభ్యర్థనను పరిశీలిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే, చైనాతో చాలా కాలంగా ఉన్న సమస్యల తర్వాత.. చైనీస్‌తో నడిచే యాప్‌ను భారత్‌లో రీలాంచ్ చేయడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందా  లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే, భారతీయ యూజర్లతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి కంపెనీ ఎదురుచూస్తోందని టిక్‌టాక్ ప్రతినిధి చెప్పారు. భద్రతా సమస్యల కారణంగా టిక్‌టాక్ నిషిధించిన సంగతి తెలిసిందే.

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ భారతీయ యూజర్ల వ్యక్తిగత డేటాను స్టోర్ చేయడం, స్టోర్ చేసిన డేటా చైనాలోని ప్రభుత్వ అవుట్‌లెట్‌లతో షేర్ అవుతుందని భారత భద్రతా నిపుణులు ఆరోపించారు. ఊహించినట్టుగా టిక్‌టాక్ దేశానికి తిరిగి వస్తే, భారతీయ చట్టాలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండవలసి ఉంటుందని ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. క్లిష్టమైన వినియోగదారు డేటాను భారతదేశం వెలుపల నిల్వ చేయకూడదు.అన్ని యాప్‌లు వెబ్‌సైట్‌లు డేటాను స్థానికంగా నిల్వ చేయడానికి నిబంధనలను రూపొందించాయి లేదా వాటి డేటా నిల్వ ప్రాసెసింగ్ విధానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నాయి. (టిక్‌టాక్) తిరిగి వస్తే, వారు ఈ బంధనలను అనుసరించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. టిక్‌టాక్‌కు ఇండియాలోభారీ యూజర్ బేస్ ఉంది. చైనా బయటి అతిపెద్ద మార్కెట్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. 2019లో, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో భారత్ యూజర్లే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Read Also : TikTok Beats Google : భారత్ బ్యాన్ చేసినా నెంబర్ 1.. గూగుల్‌ను బీట్ చేసిన టిక్ టాక్

ట్రెండింగ్ వార్తలు