TikTok Beats Google : భారత్ బ్యాన్ చేసినా నెంబర్ 1.. గూగుల్‌ను బీట్ చేసిన టిక్ టాక్

ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన యాప్ ఇది. షార్ట్ వీడియోస్ తీసి ఈ యాప్ లో పోస్ట్ చేసి ఎంతోమంది..

TikTok Beats Google : భారత్ బ్యాన్ చేసినా నెంబర్ 1.. గూగుల్‌ను బీట్ చేసిన టిక్ టాక్

Tiktok Beats Google

TikTok beats Google : ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన యాప్ ఇది. షార్ట్ వీడియోస్ తీసి ఈ యాప్ లో పోస్ట్ చేసి ఎంతోమంది స్టార్లుగా గుర్తింపు పొందారు. కాగా, టిక్ టాక్ మరో ఘనత సాధించింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ను వెనక్కి నెట్టేసింది. 2021 సంవత్సరానికి అత్యంత పాపులర్ సోషల్ మీడియా వెబ్ సైట్ (యాప్) గా టిక్ టాక్ నిలిచింది. ప్రముఖ స్టోరేజ్ సాఫ్ట్ వేర్ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ (Cloudflare) ఈ విషయాన్ని ప్రకటించింది. టిక్ టాక్ ఈ ఏడాది అత్యధిక హిట్స్ ను(మోస్ట్ విజిటెడ్ సైట్) సంపాదించిందని తెలిపింది.

Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

‘‘ర్యాంకుల పరంగా ఫిబ్రవరిలో టిక్ టాక్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మార్చి, జూన్ లోనూ మొదటి స్థానంలో నిలిచింది. తిరిగి ఆగస్ట్ నుంచి హిట్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది’’ అని క్లౌడ్ ఫ్లేర్ తెలిపింది. పాపులర్ సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లను వెనక్కినెట్టి మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా టిక్ టాక్ నిలిచింది.

2020లో హిట్స్ పరంగా గూగుల్ మొదటి స్థానంలో ఉండగా టిక్ టాక్, అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ టాప్ 10లో నిలిచాయి. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు చెందినదే టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. అంతేకాదు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

కాగా, దేశ భద్రతకు ముప్పు అంటూ 2020లో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను నిషేధించడం తెలిసిందే. అంతకుముందు వరకు ఇది మన దేశంలోనూ ఎక్కువ మంది యూజర్లతో శరవేగంగా దూసుకుపోయింది.