TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. నిలిచిపోయిన సర్వీసులు.. ట్రంప్ నిర్ణయంపైనే కంపెనీ ఆశలు..!
TikTok Ban : టిక్‌టాక్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెరికాలోని వ్యక్తులు ఇకపై టిక్‌టాక్ యాప్ ఉపయోగించలేరు.

TikTok stops working in US
TikTok Ban : అగ్రరాజ్యం అమెరికాలో ప్రముఖ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ బ్యాన్ అయింది. టిక్‌టాక్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెరికాలోని వ్యక్తులు ఇకపై టిక్‌టాక్ యాప్ ఉపయోగించలేరు. నెలల తరబడి న్యాయ పోరాటాల తర్వాత జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా టిక్‌టాక్‌ని నిషేధించే చట్టాన్ని జనవరి 17న అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది.
యుఎస్‌లోని టిక్‌టాక్ వినియోగదారులు ఇప్పుడు యాప్‌ను ఓపెన్ చేయగానే ఒక మెసేజ్ కనిపిస్తోంది. “దురదృష్టవశాత్తూ.. యుఎస్‌లో టిక్‌టాక్‌ను నిషేధించే చట్టం అమల్లోకి వచ్చింది. మీరు ప్రస్తుతం టిక్‌టాక్‌ని ఉపయోగించలేరు. అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిక్‌టాక్‌ను రీస్టోర్ చేసేందుకు అనుమతినిస్తారని భావిస్తున్నాం. దయచేసి అప్పటివరకూ వేచి ఉండండి” అని మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.
Read Also : Realme P3 5G Leak : రియల్‌మి P3 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..
టిక్‌టాక్‌ని అమెరికా ఎందుకు నిషేధించింది. యుఎస్ అధికారులు టిక్‌టాక్ గురించి ఆందోళనలను లేవనెత్తారు. జాతీయ భద్రతకు ప్రమాదంగా పేర్కొంది. చైనీస్ ప్రభుత్వం అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు యాప్‌ను ఉపయోగించవచ్చుననే ఉద్దేశంతో విశ్వసిస్తున్నారు.
BREAKING: TikTok confirms its services will be temporarily unavailable in the US pic.twitter.com/cgqMfppQ5U
— The Spectator Index (@spectatorindex) January 19, 2025
ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు కంపెనీలు సాయం చేయాల్సిన చైనా జాతీయ భద్రతా చట్టాల నుంచి ఆందోళనకు దారితీసింది. టిక్‌టాక్ సాఫ్ట్‌వేర్ ద్వారా అమెరికన్ల డివైజ్‌లను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేయగలదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే గత ఏడాదిలోనే విషయాన్ని బయటపెట్టారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ టిక్‌టాక్‌ను నిషేధించే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చైనీస్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ యూఎస్ ప్రభుత్వం ఆమోదించిన కొనుగోలుదారుకు విక్రయించేందుకు అంగీకరించలేదు. టిక్‌టాక్ విక్రయానికి బైట్‌డాన్స్‌కు జనవరి 19 వరకు గడువునిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్ 2024లో చట్టంపై సంతకం చేశారు. అయితే, చట్టాన్ని కోర్టులో సవాలు చేసేందుకు బైట్‌డాన్స్ చేసిన ప్రయత్నం విఫలమైంది.
డిసెంబరు 6న ముగ్గురు ఫెడరల్ న్యాయమూర్తుల ప్యానెల్ టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. చట్టం మొదటి సవరణ ప్రకారం.. వాక్ స్వాతంత్ర్య హక్కులను ఉల్లంఘిస్తుందనే వాదనను తిరస్కరించింది. జనవరి 17న టిక్‌టాక్ అప్పీల్‌ను సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఫలితంగా జనవరి 19 నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది.
యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్ తొలగించిన ఆపిల్, గూగుల్ :
ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్ యాప్ తొలగించాయి. ఫారిన్ అడ్వర్సరీ కంట్రోల్డ్ అప్లికేషన్స్ యాక్ట్ నుంచి అమెరికన్లను రక్షించాలనే సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగించింది. యాప్ స్టోర్‌లోని టిక్‌టాక్ పాత యాప్ పేజీలో “ఈ యాప్ ప్రస్తుతం మీ దేశంలో లేదా ప్రాంతంలో అందుబాటులో లేదు” అని ఒక మెసేజ్ పేర్కొంది. ఆపిల్ తన సపోర్టు పేజీలో అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.
టిక్‌టాక్ భవిష్యత్తు ఏంటి? :
అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. కొత్త చట్టం ప్రకారం.. ఆపిల్, గూగుల్ వంటి యాప్ స్టోర్ల నుంచి అప్‌డేట్‌లు, సపోర్ట్ నిలిచిపోతుంది. కాలక్రమేణా, యాప్ పూర్తిస్థాయిలో సర్వీసులు నిలిచిపోతాయని భావిస్తున్నారు. చివరికి, టిక్‌టాక్ అగ్రరాజ్యంలో పూర్తిగా నిరుపయోగంగా మారవచ్చు.
జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ట్రంప్ టిక్‌టాక్ పరిస్థితిని “చాలా పెద్ద పరిస్థితి”గా పేర్కొన్నారు. 90 రోజుల పాటు టిక్‌టాక్ నిషేదించే అవకాశం ఉంది. టిక్‌టాక్ వినియోగదారులు, యాప్ ఆధారిత వ్యాపారాలు అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే.. యాప్ ఇప్పటికే అమెరికాలో సర్వీసులను నిలిపివేసింది.
Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? మరో చైనా యాప్ తెగ డౌన్‌లోడ్ చేస్తున్నారట..!