New Smartphones : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. టాప్ 3 ‘లాంగ్ బ్యాటరీ లైఫ్’ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఫీచర్లు మాత్రం కేక..!

New Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో Y58 5G, ఒప్పో ఫైండ్ X8, iQOO Z9x 5G అనే టాప్ 3 లాంగ్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New Smartphones : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. టాప్ 3 ‘లాంగ్ బ్యాటరీ లైఫ్’ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఫీచర్లు మాత్రం కేక..!

Top 3 Long Batter Life Smartphones

Updated On : February 16, 2025 / 6:22 PM IST

Long Battery Life Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక స్మార్ట్‌‌ఫోన్లు ఉన్నాయి. అందులోనూ లైఫ్ బ్యాటరీ లైఫ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగదారులు లాంగ్ బ్యాటరీ లైఫ్ ఫోన్లనే కొనేందుకు ఇష్టపడతారు.

ప్రతిఒక్కరూ ఇలాంటి ఫోన్లపై ఫోకస్ పెడుతుంటారు. బ్యాటరీపరంగానే కాదు ధర విషయంలో కూడా అంతే వాల్యూను అందిస్తాయి. రూ. 20వేల లోపు ధర నుంచి రూ. 70 వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

లాంగ్ బ్యాటరీ లైఫ్ ఫోన్లను ఎంచుకోవడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండేలా చేస్తుంది. ఛార్జింగ్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువ సమయం ప్లే బ్యాక్ టైమ్ అందిస్తాయి.

మీరు కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం వివో Y58 5G, ఒప్పో ఫైండ్ X8, iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

వివో Y58 5జీ స్పెసిఫికేషన్, ధర :

డిస్‌ప్లే : 6.8 అంగుళాలు
బ్యాటరీ : 6000mAh
కెమెరా : 50MP ప్రైమరీ కెమెరా
ఫ్రంట్ కెమెరా : 16MP
ప్రాసెసర్ : ఆక్టా కోర్
ర్యామ్ : 8GB
స్టోరేజీ : 128GB
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14
ధర : 18,499

ఒప్పో ఫైండ్ X8 స్పెసిఫికేషన్, ధర :

డిస్‌ప్లే : 6.6 అంగుళాలు
బ్యాటరీ : 5500mAh
కెమెరా : 50MP ప్రైమరీ కెమెరా
ఫ్రంట్ కెమెరా 32MP
ప్రాసెసర్ : ఆక్టా కోర్
ర్యామ్ : 12GB
స్టోరేజీ : 256GB
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15
ధర : రూ. 69,999

Read Also : Health Insurance : మీరు ఇంకా ‘ఆరోగ్య బీమా’ తీసుకోలేదా? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే.. ఇప్పుడే అడిగి మరి తీసుకుంటారు..!

ఐక్యూ Z9x 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర :

డిస్‌ప్లే : 6.7 అంగుళాలు
బ్యాటరీ : 6000mAh
కెమెరా : 50MP ప్రైమరీ కెమెరా
ఫ్రంట్ కెమెరా : 8MP
ప్రాసెసర్ : ఆక్టా కోర్
ర్యామ్ : 4GB
స్టోరేజీ : 128GB
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14
ధర : రూ. 12,998