Top 5 Smartphones : మార్కెట్లో ఈ ఫోన్లకే ఫుల్ డిమాండ్.. టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు మీకోసం.. ఏ ఫోన్ బెస్ట్ అంటే?

Top 5 Smartphones :  ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.

Top 5 Smartphones : మార్కెట్లో ఈ ఫోన్లకే ఫుల్ డిమాండ్.. టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు మీకోసం.. ఏ ఫోన్ బెస్ట్ అంటే?

Top 5 Smartphone Brands In India Smartphone Market, You Can Buy Which Brand You Like Any More

Updated On : April 21, 2022 / 9:21 AM IST

Top 5 Smartphones :  ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా, జాతీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీని ఫలితంగా క్యూ1 ఫలితాల్లో మొబైల్ షిప్ మెంట్ 11శాతంగా క్షీణించాయి.

అందులోనూ యుక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాలతో పాటు కరోనా కూడా తీవ్ర ప్రభావం చూపింది. మొబైల్ షిప్ మెంట్ దారుణంగా పడిపోయిందని రీసెర్చ్ కంపెనీ కెనాలసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రధానంగా షిప్ మెంట్ పడిపోయిన కంపెనీల్లో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung)  ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చైనా బ్రాండ్ షావోమీ, ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీలు వరుసగా నిలిచినట్టు కెనాలసిస్ రిపోర్టులో వెల్లడించింది. కానీ, ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో కొన్ని మోడళ్లకు మాత్రం ఉన్న డిమాండ్, గిరాకీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. పైగా వాటికి సేల్స్ అధికంగా పెరిగినట్టు నివేదిక తెలిపింది. ఆపిల్ కంపెనీ iPhone 13, iPhone SE స్మార్ట్ ఫోన్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని పేర్కొంది.

Read Also :  Best Mobile Phones : రూ. 10వేల లోపు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Top 5 Smartphone Brands In India Smartphone Market, You Can Buy Which Brand You Like Any More (1)

Top 5 Smartphone Brands In India Smartphone Market, You Can Buy Which Brand You Like Any More

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజమైన షావోమీ కంపెనీ నుంచి సబ్ బ్రాండ్లలో Redmi Note Series, Oppo కంపెనీలకు చెందిన One Plus, Vivo స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయని రీసెర్చ్ కంపెనీ కెనాలసిస్ వెల్లడించింది. కెనాలసిస్‌ అనలిస్ట్‌ సన్యాం చౌరాసియా (Sanyam Chaurasia) ప్రకారం.. ఆపిల్ కంపెనీకి చెందిన iPhone 13కు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్‌ ఉందని అంగీకరించారు. మిడ్‌ రేంజ్‌ ఫోన్ల విషయానికి వస్తే.. మార్చిలో విడుదలైన iPhone SE స్మార్ట్ ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ యూజర్లను భారీగా ఆకట్టుకుందని అన్నారు. చిప్‌‌సెట్‌లను అప్‌గ్రేడింగ్, బ్యాటరీ పర్మామెన్స్ 5G స్మార్ట్‌ ఫోన్‌లే యూజర్లను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.

Read Also : New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు