Twitter Accounts : మీ ట్విట్టర్‌లో ఆ లింకులను ప్రమోట్ చేస్తున్నారా? ఈ కొత్త విధానంతో మీ అకౌంట్లను కోల్పోతారు జాగ్రత్త..!
Twitter Accounts : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటినుంచి ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మస్క్ అడుగుపెట్టాడో లేదో.. ట్విట్టర్ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ట్విట్టర్ ఉన్నత పదవుల ఉద్యోగుల నుంచి దాదాపు అందరిపై వేటు వేశాడు మస్క్.

Twitter Accounts _ Twitter to remove accounts promoting other social media platforms
Twitter Accounts : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటినుంచి ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మస్క్ అడుగుపెట్టాడో లేదో.. ట్విట్టర్ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ట్విట్టర్ ఉన్నత పదవుల ఉద్యోగుల నుంచి దాదాపు అందరిపై వేటు వేశాడు మస్క్.
అంతేకాదు.. పాత నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చాడు. ట్విట్టర్ వెరిఫికేషన్ వంటి ఎన్నో విధానాల్లో మార్పులు చేశాడు. మస్క్ చర్యలపై ట్విట్టర్ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా వెనక్కి తగ్గని మస్క్ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నాడు.
ఇప్పుడు సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)లో మరో కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చాడు ఎలన్ మస్క్. ట్విట్టర్ పోటీదారులైన ఇతర సోషల్ ప్లాట్ ఫారంలపై ఎలాంటి లింకులు ప్రమోట్ చేసినా చర్యలు తప్పవని ట్విట్టర్ యూజర్లకు షాకిచ్చాడు. ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల్లో లింక్‌లు లేదా యూజర్ నేమ్ కలిగిన కంటెంట్‌ను ప్రమోట్ చేసిన అకౌంట్లను వెంటనే తొలగించనున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.
అంటే.. ఇక్కడ ఈ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల లిస్టులో Facebook, Instagram, Mastodon, Truth Social, Tribel, Nostr అనేక పోస్టులు ఉన్నాయి. ఈ కొత్త విధానం అనేది లిస్టులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Twitter Accounts _ Twitter to remove accounts promoting other social media platforms
ఇతర సోషల్ ప్లాట్ ఫారంలకు ఈ విధానం వర్తించదని స్పష్టం చేసింది. ఎవరైతే ట్విట్టర్ యూజర్లు తమ ఇతర సోషల్ అకౌంట్లను ప్రమోట్ చేసుకునేందుకు ట్విట్టర్ ప్లాట్ ఫారంను వినియోగించుకుంటారో ఆయా అకౌంట్లను వెంటనే తొలగించడం జరుగుతుందని కంపెనీ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, కంపెనీ జాబితాలో లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు లింక్‌లు లేదా యూజర్ నేమ్ పోస్ట్ చేసినా కూడా ఈ విధానాన్ని ఉల్లంఘించినట్టు కాదని మరో ట్వీట్‌లో స్పష్టం చేసింది. మాస్టోడాన్ (Mastodon)కు చెందిన అకౌంట్లను సస్పెండ్ చేసిన కొద్ది రోజుల తర్వాత మాస్టోడాన్ (Mastodon) ‘ఫ్రీ ప్రమోషన్’కు వ్యతిరేకంగా ట్విట్టర్ ప్రకటన చేసింది.
Should I step down as head of Twitter? I will abide by the results of this poll.
— Elon Musk (@elonmusk) December 18, 2022
మాస్టోడాన్ అకౌంట్ల సస్పెన్షన్ వెనుక కారణాలపై కూడా క్లారిటీ లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు అనేక లింక్‌లను షేర్ చేయడం ‘Harmful’ అని ఫ్లాగ్ చేసింది. ట్విట్టర్ ఇప్పటికే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ప్రమోషన్ కోసం మాత్రమే క్రియేట్ చేసిన అన్ని ట్విట్టర్ అకౌంట్లను తొలగించింది.
మరోవైపు.. ట్విట్టర్ కొత్త యజమాని ఎలోన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ యజమానిగా వైదొలగాలని కోరుతూ పోల్ నడుస్తోంది. ఎలోన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్‌తో అక్టోబర్ 28న ట్విట్టర్‌ని కొనుగోలు చేశాడు. మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సైట్‌లో అనేక మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ అకౌంట్ల వెరిఫికేషన్.. బ్లూ టిక్ మార్క్ కోసం అప్లయ్ చేసుకోండిలా..