Twitter Retire : బిగ్ అలర్ట్.. ‘ట్విట్టర్’ డొమైన్‌కు గుడ్‌బై.. ఈ తేదీలోగా 2FA రీసెట్ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్ పోయినట్టే..!
Twitter Retire : ఎలోన్ మస్క్ ఎక్స్ అన్ని సర్వీసులను కొత్త x.com డొమైన్‌కు మైగ్రేట్ చేస్తోంది. ట్విట్టర్.కామ్ అధికారికంగా రిటైర్ అవుతోంది. మీ అకౌంట్ కావాలంటే వెంటనే ఈ పనిచేయండి.
Twitter Retire
Twitter Retire : ఎక్స్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ట్విట్టర్ డొమైన్ పూర్తిగా నిలిచిపోనుంది. ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ సంస్థ పూర్తి (x.com) మైగ్రేషన్‌లో భాగంగా (twitter.com) డొమైన్‌ను అధికారికంగా నిలిపివేయనుంది. అప్పటిలోగా ట్విట్టర్ యూజర్లు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) కోసం హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీలు లేదా పాస్‌కీలపై ఆధారపడేవారు నవంబర్ 10, 2025 నాటికి తమ లాగిన్ వివరాలను తిరిగి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. తమ అకౌంట్లు ఆటో లాక్ అవుతాయి.
సెక్యూరిటీ కీలతో రీ-ఎన్‌రోల్ మస్ట్ :
ఎక్స్ సేఫ్టీ ప్రకారం.. ప్రస్తుత హార్డ్‌వేర్ ఆధారిత 2FA లాగిన్ (Twitter Retire) వివరాలు ప్రత్యేకంగా లెగసీ (twitter.com) డొమైన్‌తో లింక్ కావడంతో అన్నింటిని మళ్లీ రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అథెంటికేషన్ వంటి మౌలిక సదుపాయాలు (x.com)కి మైగ్రేట్ అవుతున్నాయి. అందుకే ఎక్స్ యూజర్లు తమ సెక్యూరిటీ కీలను కొత్త డొమైన్‌తో తిరిగి రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ అప్‌డేట్ ఏదైనా సెక్యూరిటీ గ్లిచ్ వల్ల కాదని, డొమైన్ మైగ్రేషన్ కారణంగా మాత్రమేనని సంస్థ వివరించింది. ఎస్ఎంఎస్ కోడ్‌లు, అథెంటికేషన్ యాప్‌లు వంటి ఇతర వెరిఫైడ్ మెథడ్స్ ప్రభావితం కావు. ఎలాంటి రీకాన్ఫిగరేషన్ అవసరం లేకుండానే రన్ అవుతాయి.
Read Also : Elon Musk : జీతం పెంచకపోతే మానేస్తా.. ధమ్కీ ఇస్తున్న ఎలాన్ మస్క్.. టెస్లా బాస్ అన్నంత పనిచేస్తాడా?
నవంబర్ 10 తర్వాత జరిగేది ఇదే :
నవంబర్ 10 నాటికి యూజర్లు హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీలను రీసెట్ చేసుకోకపోతే వారి అకౌంట్లు ఆటోమాటిక్‌గా లాక్ అవుట్ అవుతాయి. అప్పుడు తమ ప్రస్తుత సెక్యూరిటీ కీని తిరిగి రిజిస్టర్ చేసుకోవాలి. 2FA మరో మెథడ్‌కు మారాలి లేదా వారి అకౌంట్లను తిరిగి యాక్సెస్ చేసేందుకు 2FAను తాత్కాలికంగా నిలిపివేయాలి. అకౌంట్ల సెక్యూరిటీ కోసం ముఖ్యంగా ప్రధాన యూజర్లు, అథెంటికేటెడ్ అకౌంట్లకు కనీసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మోడ్‌ను ఎనేబుల్ చేయాలని ఎక్స్ యూజర్లను అలర్ట్ చేస్తోంది.
ట్విట్టర్.కామ్ డొమైన్ ప్లాట్‌ఫామ్ రీబ్రాండింగ్ కారణంగా అనేక అంతరాయాలు ఏర్పడొచ్చు. ట్విట్టర్.కామ్ డొమైన్ ఇంటర్నెట్ అంతటా లింక్ అయింది. ఏపీఐ కీలు, ట్వీట్‌లు, మిలియన్ల కొద్దీ షేర్డ్ లింకులు ఉన్నాయి. డెవలపర్‌లు, యూజర్లు డొమైన్ రిటైర్ తర్వాత కూడా తాత్కాలిక అంతరాయాలను ఏర్పడొచ్చు. ట్విట్టర్.కామ్ పూర్తిగా ఇన్‌యాక్టివ్ అయ్యే టైమ్ గురించి ఎక్స్ కంపెనీ ఇంకా క్లియర్ షెడ్యూల్ రివీల్ చేయలేదు. ఈ అథెంటికేషన్ డొమైన్ రిటైల్ టైమ్ దగ్గరపడుతోందని మాత్రం సూచిస్తోంది.
