Delhi HC : ఆధార్ సంఖ్యను మార్చవచ్చా ? కుదరదన్న UIDAI

ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ను మార్చాలని..దీనివల్ల గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Aadhaar Number : ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకొనే అవకాశాన్ని ఉడాయ్ కల్పించిన సంగతి తెలిసిందే. తప్పుగా పేర్లు, ఫోన్ నంబర్లు వచ్చినా మార్చుకోవచ్చు. కానీ..నెంబర్ ను మార్చేసి మరో నెంబర్ తీసుకోవచ్చా ? అనే డౌట్స్ రావడం సహజమే. కానీ…మరో సంఖ్యను కేటాయించడం సాధ్యం కాదని ఉడాయ్ తేల్చిచెప్పింద. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి అనుమతినిస్తే…ఇబ్బందులు వస్తాయంది.

Read More : Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

తన ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ను మార్చాలని..దీనివల్ల గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోర్ట స్వీకరించింది. జస్టిస్ రేఖాపల్లి విచారణకు చేపట్టారు. ఉడాయ్ తరపున న్యాయవాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. ప్రతి ఆధార్ కార్డు దారు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని కోర్టుకు తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల మాదిరిగా..తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతొక్కరూ నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తే అవకాశం ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు