Digital Key: శాంసంగ్ విప్లవాత్మక టెక్నాలజీ.. స్మార్ట్‌ఫోన్‌తోనే కారు అన్‌లాక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ సంస్థ త్వరలోనే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి కారు లాక్, అన్ లాక్ చేసే డిజిటల్ ‘కీ’ సిస్టమ్‌ను తయారుచేసేందుకు ప్లాన్ చేస్తుంది.

Digital Key
Unlock a New Experience: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ సంస్థ త్వరలోనే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి కారు లాక్, అన్ లాక్ చేసే డిజిటల్ ‘కీ’ సిస్టమ్‌ను తయారుచేసేందుకు ప్లాన్ చేస్తుంది. అల్ట్రా-వైడ్‌బ్యాండ్(UWB), నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ (ఎన్‌ఎఫ్‌సి)-ఎనేబుల్డ్ డిజిటల్ కార్ కీస్‌ను త్వరలో ఆవిష్కరించబోతుంది శాంసంగ్. ఈ డిజిటల్ ‘కీ’స్ తొలుత దక్షిణ కొరియా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ జెనెసిస్ GV 60 కార్లకు శాంసంగ్ కీస్ తయారుచేయబోతుంది శాంసంగ్. గెలాక్సీ ఎస్ 21 లాంచ్ సమయంలో తన ఫోన్‌లలో డిజిటల్ కార్ కీస్ అవకాశాన్ని చూస్తున్నట్లుగా శాంసంగ్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పలు శాంసంగ్ మోడళ్లలో తెచ్చేందుకు శాంసంగ్ ప్రయత్నాలు చేస్తోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ , శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్స్ UWB టెక్నాలజీతో పలు ఎలక్ట్రానిక్ వాహనాలను కీస్ లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ సహాయంతో కార్ విండోస్ కూడా తెరవడం.. మూయడం చేయవచ్చు.
ఎంబెడెడ్ సెక్యూర్ ఎలిమెంట్(ESE) ద్వారా డిజిటల్ ‘కీ’స్ పనిచేయనున్నాయి. శాంసంగ్ కేవలం జెనెసిస్ GV 60 కార్లకు మాత్రమే డిజిటల్ ‘కీ’స్ పనిచేసే అవకాశం ఉంది. ఆడి, BMW, ఫోర్డ్ వంటి దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలలో శాంసంగ్‌కు షేర్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోతున్న క్రమంలో భవిష్యత్తులో ఆటోమొబైల్ కంపెనీలే టార్గెట్‌గా కంపెనీ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.