Upcoming Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రాబోయే 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Upcoming Phones 2024 : రాబోయే నెలలో అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేసేందుకు తయారీ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో ఏయే స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయో ఓసారి లుక్కేయండి.

Upcoming Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రాబోయే 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Upcoming phone launches in October 2024_ OnePlus 13, iQOO 13, Lava Agni 3 and more

Updated On : October 2, 2024 / 7:38 PM IST

Upcoming Phones 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోమే.. గత సెప్టెంబర్ నెలలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, వివో టీ3 అల్ట్రా, మోటోరోలా రెజర్ 50తో సహా అనేక స్టార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. రాబోయే నెలలో అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేసేందుకు తయారీ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో ఏయే స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయో ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని ధృవీకరించింది. ఈ ఫోన్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్‌తో వస్తుందని, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్చు.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ త్వరలో ముగుస్తోంది.. ఇప్పడే ఐఫోన్ 15 సిరీస్ కొనేసుకోండి.. లేదంటే ధర పెరగొచ్చు..!

ఐక్యూ 13 :
వివో సబ్-బ్రాండ్ ఐక్యూ ప్రీమియం ఐక్యూ 13 సిరీస్‌ను అక్టోబర్‌లో చైనాలో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ 13 మాదిరిగా ఐక్యూ 13 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వివో ఫోన్ గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు o స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఐక్యూ 13 ఫోన్ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2K అమోల్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. భారీ 6,150mAh బ్యాటరీతో రావచ్చు. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ :
శాంసంగ్ ఇప్పటికే లేటెస్ట్ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ప్రకటించింది. అయితే, ఫోన్ అక్టోబర్ 3 నుంచి భారత మార్కెట్లో విక్రయానికి రానుంది. ఈ ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్2400ఇ చిప్‌సెట్‌తో వస్తుంది. 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీకి సపోర్టు అందిస్తుంది.

లావా అగ్ని 3 :
భారత మార్కెట్లో లావా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 3 అక్టోబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అగ్ని 3 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో రానుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో అదే చిప్‌సెట్ కలిగి ఉంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. అయితే, స్టోరేజీ లేదా ర్యామ్ టైమ్ గురించి ఎటువంటి సమాచారం లేదు. మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. అగ్ని 3 బ్యాక్ సైడ్ 64ఎంపీ ప్రైమరీ షూటర్, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో షూటర్ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్‌తో రావచ్చు. అగ్ని 3 ఆండ్రాయిడ్ 14 ఆధారంగా స్టాక్ ఆండ్రాయిడ్‌కి దగ్గరగా ఉన్న లావా సొంత యూఐపై రన్ అవుతుందని భావిస్తున్నారు. రాబోయే మిడ్-రేంజర్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయగలదు. 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ :
ఇన్ఫినిక్స్ ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొన్ని మార్కెట్‌లలో లాంచ్ చేసింది. అయితే, కంపెనీ ఇప్పుడు మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్‌ను అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని పుకార్లు సూచిస్తున్నాయి. జీరో ఫ్లిప్ 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

కవర్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. 1056 x 1066 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 3.64 అంగుళాల అమోల్డ్ ప్యానెల్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి జీ77 ఎంసీ9 జీపీయూతో వస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉండవచ్చు.

Read Also : Best Phones 2024 : కొత్త ఫోన్ కావాలా? రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!