త్వరలోనే విడుదల కానున్న 7 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడీగా ఉన్నారా?

భారత మార్కెట్‌లో విడుదల కానున్నాయి.

త్వరలోనే విడుదల కానున్న 7 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడీగా ఉన్నారా?

Updated On : May 2, 2025 / 7:18 PM IST

శాంసంగ్, వన్‌ప్లస్‌, మోటోరోలా, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్లు త్వరలోనే తమ కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో స్లిమ్ డిజైన్లతో, శక్తిమంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను చిన్న సైజులో తీసుకొచ్చేందుకు ఆయా బ్రాండ్లు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్: యూజర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్లలో ఒకటి Samsung Galaxy S25 Edge. కంపెనీ అధికారికంగా వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది మే 13న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ బాగా స్లిమ్‌గా ఉంటుంది (మందం కేవలం 5.84mm) అలాగే బరువు కూడా 162 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది 6.6-అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండొచ్చు. అలాగే Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రాబోతుందని అంచనా. బ్యాటరీ 3,900mAh ఉండొచ్చు.

వన్‌ప్లస్‌ 13ఎస్‌: వన్‌ప్లస్‌ కూడా భారత్‌లో తన కొత్త కాంపాక్ట్ ఫోన్ వన్‌ప్లస్‌ 13ఎస్‌ను విడుదల చేయబోతుంది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు.. కానీ, ఈ నెలలోనే వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రావచ్చు. స్క్రీన్ పరిమాణం 6.32 అంగుళాలు ఉండవచ్చు. ఇది బ్లాక్ అలాగే పింక్ కలర్స్ లో రాబోతుందని తెలుస్తుంది. ధర సుమారు రూ.55,000 ఉండవచ్చు.

Also Read: స్మార్ట్‌ఫోన్ అంటే ఇలా ఉండాలి… వివో నుంచి వస్తున్న కొత్త ఫోన్‌ ఫీచర్లు ఏం ఉన్నాయ్‌ భయ్యా…

రియల్‌మీ జీటీ 7: చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 మే నెలలో భారత్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్‌లో 120fps గేమింగ్ కు సపోర్ట్ ఉందని కంపెనీ తెలిపింది. ఇది MediaTek Dimensity 9400+ చిప్‌తో, 16GB RAM అలాగే 1TB స్టోరేజ్ తో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్ వేర్ ని బేస్ చేసుకొని రియల్‌మీ UI 6.0 పై పనిచేస్తుంది.

టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌: టెక్నో పోవా కర్వ్‌ 5G కూడా మే చివర్లో భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుంది. ఇందులో కర్వ్డ్ డిస్‌ప్లే, మెటాలిక్ ఫినిష్, డ్యూయల్ కెమెరాలు + LED లైటింగ్ ఉంటాయి. ఇది స్టైలిష్ డిజైన్‌ను ఇష్టపడే యూజర్ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌గా రూపుదిద్దుకుంది.

ఐక్యూ నియో 10: iQOO సంస్థ భారత్‌లో Neo 10 ను విడుదల చేయబోతుంది. ఇది చైనాలో విడుదలైన Neo 10 Pro+ కు రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు. ఇందులో 120W ఫాస్ట్ చార్జింగ్, OLED డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. ఇది హై-పర్ఫార్మెన్స్ ఫోన్.

పోకో F7, F7 Ultra: పోకో F7, F7 Ultra ఈ నెలలో భారత మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఇవి Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌తో రానుండగా, భారీగా 7,550mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.