Vi Prepaid Packs : వొడాఫోన్ ఐడియా 3 OTT ప్రీపెయిడ్ ప్యాక్స్ ఎత్తేసింది.. వెంటనే చెక్ చేసుకోండి!
ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తమ యూజర్లకు షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ప్యాకులను నిలిపివేసింది.

Vi Discontinues Rs. 501, Rs. 601, Rs. 701 Prepaid Packs With 1 Year Of Disney+ Hotstar
Vi Prepaid Packs : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తమ యూజర్లకు షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ప్యాకులను నిలిపివేసింది. ఇప్పటికే పోటీదారు కంపెనీలైన భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో సంస్థలు ఓటీటీ ఆధారిత ఏడాది ప్యాకులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు ఇదే బాటలో వోడాఫోన్ ఐడియా కూడా ఓటీటీ (Disney+ Hotstar) ఏడాది సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదివరకే మొబైల్ టారిఫ్ ధరలను అమాంతం పెంచేసిన టెలికం దిగ్గజాలు వరుసగా రీఛార్జ్ ప్యాకులను రివైజ్ చేసేస్తున్నాయి. ప్రస్తుతం అందించే ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేస్తున్నాయి. అందులోనూ ఓటీటీ ఆధారిత ప్రీపెయిడ్ ప్యాకులను నిలిపివేస్తున్నాయి.
వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ఓటీటీ ప్యాక్ ప్లాన్లలో రూ.501, రూ. 601, రూ. 701 ప్యాకేజీలను నిలిపివేసింది. ఈ మూడింట్లో రెండు ప్యాకేజీల్లో Disney+ Hotstar ఏడాది సబ్ స్ర్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమ సబ్ స్ర్కిప్షన్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. డీస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచడంతోనే మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు కూడా తమ ప్యాకులపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పుడు ఈ ప్యాకులను నిలిపివేయడంతో ప్రస్తుతం యాక్టివేట్‌లో ఉన్న యూజర్లకు గడువు తేదీవరకు ఇబ్బంది లేకపోయినా రెన్యువల్ సమయంలో అదే ప్యాక్ మాత్రం అందుబాటులో ఉండదు.
ఇప్పటినుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ తీసుకోవాలంటే ఈ ప్యాకులు అందుబాటులో ఉండవు. Disney+ Hotstar ఏడాది సబ్ స్ర్క్రిప్షన్ తో కలిపి ప్యాక్ కావాలంటే మాత్రం.. రూ. 901 నుంచి రూ.3,099 ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాల్సిందే. రూ. 901 రీఛార్జ్ చేసుకుంటే.. యూజర్లు 70 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 3GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అదనంగా 48GB డేటా పొందవచ్చు. అంతేకాదు.. అన్ లిమిటెడ్ కాల్స్, 100SMS ప్యాకేజీ అందిస్తోంది. రూ.3,099 రీఛార్జ్ ద్వారా ఏడాది వ్యాలిడిటీపై రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్, 100SMSలు పొందవచ్చు.
Read Also : Reliance Jio Alert : జియో యూజర్లకు అలర్ట్.. ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త..!