VI Plan Tariffs Hike : జియో, ఎయిర్‌టెల్ బాటలో వోడాఫోన్ ఐడియా.. బాదుడే బాదుడు.. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు..!

VI Plan Tariffs Hike : వోడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రకారం.. 28 రోజుల వ్యాలిడిటీతో ఎంట్రీ-లెవల్ ప్లాన్ టారిఫ్ ధర రూ. 179 నుంచి రూ. 199కి మొత్తంగా 11 శాతం పెంచింది.

VI Plan Tariffs Hike : జియో, ఎయిర్‌టెల్ బాటలో వోడాఫోన్ ఐడియా.. బాదుడే బాదుడు.. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు..!

VI Plan Tariffs Hike ( Image Source : Google )

VI Plan Tariffs Hike : ప్రముఖ దేశీయ టెలికం సంస్థలు వరుసబెట్టి మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచేస్తున్నాయి. ముందుగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అన్ని పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీ పెంచగా, మరో పోటీదారు భారతీ ఎయిర్‌టెల్ కూడా అదే రీతిలో మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలను పెంచింది. ఇప్పుడు, జియో, ఎయిర్‌‌టెల్ బాటలోనే అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా కూడా నడుస్తోంది.

Read Also : Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ‘ఇసిమ్’ వచ్చేసింది.. ఇదేలా పొందాలి? ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్‌ల కొత్త ప్లాన్‌లను శనివారం (జూన్ 29) ప్రకటించింది. పెరిగిన కొత్త మొబైల్ రీఛార్జ్ ధరలు వచ్చే జూలై 4 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ల ప్రకారం.. వివిధ ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్‌లలో టారిఫ్‌లు 11 శాతం నుంచి 24 శాతం మధ్య పెరగనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో 4జీ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి 5జీ సర్వీసులను ప్రారంభించేందుకు గణనీయమైన పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

వోడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్లు ఇవే :
వోడాఫోన్ ఐడియా అందించే అన్ని కొత్త టారిఫ్ ప్లాన్‌లు ఇప్పటికే ఉన్న అన్ని టచ్‌పాయింట్‌లు, ఛానెల్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రకారం.. 28 రోజుల వ్యాలిడిటీతో ఎంట్రీ-లెవల్ ప్లాన్ టారిఫ్ ధర రూ. 179 నుంచి రూ. 199కి మొత్తంగా 11 శాతం పెంచింది. టెలికాం ఆపరేటర్ అత్యంత ప్రజాదరణ పొందిన 84-రోజుల ప్లాన్ ధరను రోజుకు 1.5జీబీ డేటాతో రూ. 719 నుంచి రూ. 859కి పెంచింది.

కంపెనీ వార్షిక అన్‌లిమిటెడ్ ప్లాన్ ధరను ప్రస్తుతం రూ. 2,899 నుంచి రూ. 3,499కి సుమారు 21 శాతం పెంచింది. రోజువారీ డేటా ప్లాన్ కేటగిరీలో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటాతో వచ్చే రూ. 479 ప్లాన్ రూ. 579కి పెంచింది. దాదాపు 21 శాతం పెరిగింది. అయితే, వోడాఫోన్ ఐడియా అందించే 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 24జీబీ డేటా లిమిట్‌పై ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ. 1,799గా ఉంది.

వినియోగదారులకు సులభమైన సమగ్రమైన ప్లాన్‌లను అందించాలనే ఉద్దేశంతో వోడాఫోన్ ఐడియా ఫీచర్-రిచ్ ప్లాన్‌ రేంజ్ రూపొందించింది. ఈ ప్లాన్లతో వినియోగదారులకు సపోర్టు అందించడంతో పాటు పెరిగిన వినియోగానికి అధిక ధరలను వర్తింప చేయనుంది.

ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లలో మార్పులు కూడా నామమాత్రమేనని టెలికం దిగ్గజం పేర్కొంది. ‘హీరో అన్‌లిమిటెడ్’ ప్లాన్‌లు, స్పెషల్ ‘చౌజ్ యువర్ బెనిఫిట్’ ఆప్షన్‌తో నైట్ ఫ్రీ డేటా, వీకెండ్ డేటా రోల్ ఓవర్‌ను ప్రీ-పెయిడ్ కస్టమర్ల అందించే ఏకైక ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. విఐ మ్యాక్స్ (Vi Max) ప్లాన్‌ల కింద పోస్ట్-పెయిడ్ కస్టమర్‌లు బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంపు :
అంతకుముందు, భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్, డేటా టారిఫ్‌లన్నింటిలో 10 శాతం నుంచి 21 శాతం పెంపును ప్రకటించింది. ఒక రోజు ముందు రిలయన్స్ జియో అన్ని ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

టెలికాం ఆపరేటర్లు 5జీ సర్వీసుల్లో సేవలు, పెట్టుబడులను విస్తరించేందుకు పరిశ్రమలో టారిఫ్‌ల పెంపు తప్పనిసరిగా వాదిస్తున్నారు. ఈ క్రమంలనే ఎయిర్‌టెల్ శుక్రవారం కొత్త టారిఫ్‌లను ప్రకటించగా, “ఈ లెవల్ ఏఆర్‌పీయూ (ARPU) నెట్‌వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను అనుమతిస్తుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కొత్త టారిఫ్ ప్లాన్‌లు జూలై 3 నుంచి వర్తిస్తాయి.  వోడాఫోన్ ఐడియా పాపులర్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 719 ప్లాన్ నుంచి రూ. 859కి పెరిగింది.

ఈ ప్లాన్ కింద రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. యాడ్ ఆన్ ప్లాన్ రేట్లు కూడా పెరిగాయి. అదనపు 1 జీబీ డేటా రూ. 19 నుంచి రూ. 22కు పెరిగింది. యాడ్ ఆన్ ప్లాన్ 3 రోజుల వ్యాలిడిటీతో రూ. 39 నుంచి రూ. 48 పెరిగింది. ఈ ప్లాన్ 6జీబీ డేటా వస్తుంది. 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 479 ప్లాన్ ధరను రూ. 579కి పెరిగింది. ఇది 1.5జీబీ డేటాతో వస్తుంది. రూ. 539 డేటా ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 649కి పెరిగగా రోజువారీ 2జీబీ డేటాను అందిస్తోంది.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లివే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే!