Visa CVV-free Tokenisation : డెబిట్, క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇకపై CVV లేకుండానే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు!

Visa CVV-free Tokenisation : భారత్‌లో దేశీయ పేమెంట్ల కోసం వీసా CVV ఫ్రీ టోకనైజ్డ్ లావాదేవీలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఆన్‌లైన్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. వీసా యూజర్లు పేమెంట్లను వేగంగా సురక్షితంగా చేసుకోవచ్చు.

Visa CVV-free Tokenisation : డెబిట్, క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇకపై CVV లేకుండానే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు!

Visa launches CVV-free tokenisation for Credit And Debit Cards in India

Visa CVV-free Tokenisation : డిజిటల్ పేమెంట్లలో అగ్రగామి వీసా (Visa) ఆన్‌లైన్ లావాదేవీలను మరింత సురక్షితంగా అందించేలా విప్లవాత్మక పరిష్కారాన్ని రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ చెల్లింపుల కోసం కంపెనీ CVV-ఫ్రీ టోకనైజ్డ్ లావాదేవీలను ప్రారంభించింది. తద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. వీసా వినియోగదారుల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా వేగంగా సురక్షితంగా పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మొదటి పేమెంట్ నెట్‌వర్క్‌‌లలో వీసా మొదటదిగా చెప్పవచ్చు.

CVV ఫ్రీ- టోకనైజేషన్ అంటే ఏమిటి? :
కార్డ్ వెరిఫికేషన్ వాల్యూను సూచించే CVV ఫిజికల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వెనుక ఉన్న 3 లేదా 4 అంకెల సంఖ్య. లావాదేవీ చేసే వ్యక్తి చట్టబద్ధమైన కార్డ్ హోల్డర్ అని నిర్ధారించేందుకు అదనపు భద్రతా ఫీచర్‌గా చెప్పవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీ చేస్తున్న సమయంలో వినియోగదారు సాధారణంగా కార్డ్ నంబర్, గడువు తేదీతో పాటు CVVని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇంకా రెండు రోజులే సేల్.. త్వరపడండి..!

CVV-ఫ్రీ టోకనైజేషన్ కస్టమర్‌లు ప్రతిసారీ తమ CVVని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ లావాదేవీలు చేసేందుకు అనుమతిస్తుంది. కార్డ్ టోకనైజ్ చేయకపోతే.. ప్రారంభ టోకెన్ ప్రొవిజనింగ్ సమయంలో CVV సేకరించడం జరుగుతుంది. కానీ, వ్యాపారులు, కొనుగోలుదారులు తదుపరి టోకెన్ ఆధారిత దేశీయ CNP లావాదేవీల సమయంలో మాత్రం CVVని సేకరించడానికి వీలుండదు.

CVV ఫ్రీ-టోకనైజేషన్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలి? :
టోకనైజేషన్ అనేది కస్టమర్ కార్డ్ వివరాలను టోకెన్‌గా పిలిచే ప్రత్యేక కోడ్ అని చెప్పవచ్చు. వ్యాపారులు టోకెన్‌ను మాత్రమే సేవ్ చేస్తారు. కార్డ్ వివరాలను కాకుండా కేవలం లావాదేవీలను మరింత సురక్షితంగా చేస్తుంది. టోకెన్ టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అవుతుంది. ఒకసారి టోకనైజేషన్ సమయంలో OTP ఎంటర్ చేసిన తర్వాత మరోసారి కస్టమర్‌లు ఆన్‌లైన్ లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు.

Visa launches CVV-free tokenisation for Credit And Debit Cards in India

Visa CVV-free Tokenisation : CVV-free tokenisation for Credit And Debit Cards in India

CVV రహిత టోకనైజేషన్ కార్డ్‌లను వినియోగించేందుకు కస్టమర్‌లు తమ కార్డ్ టోకనైజ్ అయిందని నిర్ధారించుకోవాలి. వీసా కార్డ్‌ (Visa Cards)లపై లావాదేవీలకు టోకనైజేషన్‌ని ఉపయోగించే వ్యాపారులు ఇకపై దేశీయ ఆన్‌లైన్ లావాదేవీలకు CVVని నమోదు చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్‌లు తమ CVVని ఎంటర్ చేయడం గురించి ఆందోళన చెందక్కర్లేదు. ఆన్‌లైన్ లావాదేవీలకు తమ టోకెనైజ్డ్ కార్డ్ వివరాలను ఉపయోగించవచ్చు.

CVV-ఫ్రీ టోకనైజేషన్ దేశీయ కార్డ్-నాట్-ప్రెజెంట్ (CNP) టోకనైజ్డ్ లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. కస్టమర్‌లు ప్రతిసారీ తమ CVVని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. వ్యాపారులు టోకెన్‌ను మాత్రమే సేవ్ చేస్తారు. కార్డ్ వివరాలను సేవ్ చేయలేరు. సైబర్ మోసాల నుంచి కస్టమర్‌లను టోకనైజేషన్ సురక్షితంగా ఉంచుతుంది.

ఎల్లప్పుడూ అత్యుత్తమ భద్రతతో కూడిన పేమెంట్లు చేసుకోవచ్చునని సౌత్ ఏషియా ప్రొడక్ట్స్ వీసా ఇండియా హెడ్ రామకృష్ణన్ గోపాలన్ తెలిపారు. డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఆన్ లైన్ పేమెంట్ల కోసం వినియోగిస్తే.. ఇక నుంచి కార్డు వెనుక ఉండే CVV నెంబర్ ఎంటర్ చేయాల్సిన పనిలేదు. ఒకసారి టోకనైజేషన్ చేసిన తర్వాత CVV ఎంటర్ చేయకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు.

Read Also : ONDC App : కొత్త ONDC యాప్ వచ్చేసింది.. ఇక జొమాటో, స్విగ్గీతో పనిలేదు.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!