Vivo S50 Series : వివో నుంచి 2 కొత్త ఖతర్నాక్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo S50 Series : వివో సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. వివో S50 సిరీస్ వచ్చే నెలలో స్నాప్‌డ్రాగన్ చిప్‌తో లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర అంచనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo S50 Series : వివో నుంచి 2 కొత్త ఖతర్నాక్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo S50 Series

Updated On : November 14, 2025 / 8:08 PM IST

Vivo S50 Series : వివో లవర్స్ మీకోసమే.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త వివో S50 సిరీస్ రాబోతుంది. లాంచ్ టైమ్‌లైన్, కీలక స్పెసిఫికేషన్‌లు మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించాయి. వివో S50, వివో S50 ప్రో మినీ వెర్షన్లతో రానున్నాయి. ఈ లైనప్ వచ్చే నెల (డిసెంబర్)లో లాంచ్ కానుంది. వివో S50 సిరీస్ (Vivo S50 Series) స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC కింద ఉంటుందని అంచనా. గతంలో, రెండు ఫోన్‌ల డిస్‌ప్లే సైజులు, కెమెరా కాన్ఫిగరేషన్‌లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. వివో S30, వివో S30 ప్రో మినీ కన్నా ఈ రెండూ భారీ అప్‌గ్రేడ్‌లను సూచిస్తున్నాయి.

వివో S50 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :

చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో పోస్ట్‌ ప్రకారం.. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ బాటిల్ ఏంజెల్ అనే కోడ్‌నేమ్ వివో S50 సిరీస్ డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని లీక్ చేసింది. అంతేకాకుండా, లైనప్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. వివో S50 సిరీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని అంచనా. ఫ్లాగ్‌షిప్ 3nm ఆక్టా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC కన్నా తక్కువగా ఉంటుందని పుకారు ఉంది.

వివో S50 సిరీస్ బ్యాక్ సైడ్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ 2.0 సెన్సార్ కూడా ఉండవచ్చు. ఈ సిరీస్‌లోని ఫోన్‌లు ముందున్న వివో S30, వివో S30 ప్రో మినీ కన్నా అప్‌గ్రేడ్ కోర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని సమాచారం. లైనప్ “మినిమలిస్ట్” డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. వివో S50 సిరీస్‌తో కంపెనీ ఆన్‌లైన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే, హ్యాండ్‌సెట్‌ల లాంచ్‌ను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

Read Also : Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 17 ప్రో కన్నా డిజైన్ అదుర్స్.. ఆ రెండు ఫీచర్లు మాత్రం హైలెట్..!

ఇటీవలే రిపోర్టు ప్రకారం.. వివో S50 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ ఉండవచ్చు. ముందున్న 6.67-అంగుళాల 1.5K టచ్‌స్క్రీన్ కన్నా తక్కువగా ఉండొచ్చు. వివో S50 ప్రో మినీ 6.31-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా మెటల్ ఫ్రేమ్‌తో వస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో S50 బ్యాక్ సైడ్ “ఫ్లాగ్‌షిప్ మిడ్‌సోల్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సార్”తో కూడిన పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి ఉండవచ్చు.

వివో S30 ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, బ్యాక్ సైడ్ 8MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. వివో S30 సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా, హోల్-పంచ్ కటౌట్‌ ఉంది.