Vivo T3 Ultra Launch : అదిరే ఫీచర్లతో వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ చూశారా? భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Vivo T3 Ultra Launch : వివో టీ3 అల్ట్రా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రధాన సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌కు సపోర్టు అందిస్తుంది.

Vivo T3 Ultra Launch : అదిరే ఫీచర్లతో వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ చూశారా? భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Vivo T3 Ultra launched in India, price starts at Rs 31,999

Updated On : September 12, 2024 / 3:34 PM IST

Vivo T3 Ultra Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో టీ3 అల్ట్రాను లాంచ్ చేసింది. ఈ 5జీ ఫోన్ రూ. 31,999 ప్రారంభ ధరతో వస్తుంది. మిడ్ రేంజ్ 5జీ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 4, పోకో ఎఫ్6, నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మరిన్ని వంటి ఫోన్లతో పోటీపడుతుంది. ఈ కొత్త వివో ఫోన్ స్పెషిఫికేషన్లు, ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 16 Sale Offers : కొత్త ఐఫోన్ కావాలా? మరో 2 రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. భారత్‌‌లో ధర ఎంతంటే?

వివో టీ3 అల్ట్రా భారత్ ధర, సేల్ వివరాలు :
వివో టీ3 అల్ట్రా ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.31,999కు అందిస్తోంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 33,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ రూ. 35,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొత్తం లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది.

వివో టీ3 అల్ట్రా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ వివో ఫోన్ 1.5కె రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. వివో టీ3 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వివో ప్రకారం.. టీ3 అల్ట్రా 5జీ ఫోన్ 16లక్షల కన్నా ఎక్కువ (Antutu) బెంచ్‌మార్క్ స్కోర్‌ను సాధించింది. ఈ వివో ఫోన్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ పరంగా చూస్తే.. వివో టీ3 అల్ట్రా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రధాన సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌కు సపోర్టు అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వివో టీ3 అల్ట్రా ఏఐ ఎరేజర్, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్ వంటి ఏఐ-శక్తితో కూడిన ఫీచర్‌లతో వస్తుంది. ఈ ఫోన్‌లో నేరుగా ఫొటోలను ఎడిట్ చేయడం, అప్‌గ్రేడ్ వంటి ఫీచర్లను చూడవచ్చు.

Read Also : iPhone 16 Upgrade : ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేస్తున్నారా? మీ పాత ఐఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!