Vivo V50e Launch
Vivo V50e Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ కొత్త V సిరీస్ స్మార్ట్‌ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీని చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రివీల్ చేయలేదు. కానీ, రాబోయే వివో V50e ఫోన్ కలర్ ఆప్షన్లు, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించి టీజర్‌లను షేర్ చేసింది.
Read Also : Realme P3 Pro 5G : భలే డిస్కౌంట్ భయ్యా.. రియల్‌మి లవర్స్ ఈ 5G ఫోన్ అసలు వదులుకోవద్దు.. ఎందుకంటే?
వివో V50e మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉండొచ్చు. సర్కిల్ టు సెర్చ్ వంటి మల్టీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది. గత ఏడాదిలో Vivo V40e మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
వివో V50e స్పెసిఫికేషన్లు :
ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో V50e ఫోన్ వివో ఇండియా వెబ్‌సైట్‌లో ‘Coming Soon’ అనే ట్యాగ్‌తో లిస్టు చేసింది. పెర్ల్ వైట్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో స్లిమ్ బెజెల్స్‌తో రానుంది. క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. వివో V40e మాదిరిగా కొత్త మోడల్ వర్టికల్ కెమెరా మాడ్యూల్, ఆరా లైట్‌తో కనిపిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో V50e ఫోన్ సోనీ మల్టీఫోకల్ ప్రో పోర్ట్రెయిట్ కెమెరా 3 ఫోకల్ లెంగ్త్‌లతో 26mm (1x), 39mm (1.5x), 52mm (2x) కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, బ్యాక్ కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. కెమెరా సెటప్ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్‌ను అందిస్తుంది. వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్, ఫిల్మ్ కెమెరా మోడ్ ఫీచర్లతో రానుంది.
వివో V50e ఫోన్ IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అందిస్తుంది. 7.3mm మందాన్ని కలిగి ఉంది. వివో V50e AI-ఆధారిత ఫీచర్ సూట్‌తో రానుంది. ఇందులో ఏఐ ఇమేజ్ ఎక్స్‌పాండర్, ఏఐ నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ ఉన్నాయి. ఏఐ ఇమేజ్ ఎక్స్‌పాండర్ యూజర్లు ఒక ఫొటోను ఎడ్జ్‌ల నుంచి కస్టమ్ రేషియోకు విస్తరించేందుకు అనుమతిస్తుంది.
ఏఐ నోట్ అసిస్ట్ యూజర్లను నోట్స్ ఫార్మాట్ చేసేందుకు వినియోగించవచ్చు. కీ టు-డాస్‌ను క్యాప్చర్ చేయడంతో పాటు టెక్స్ట్‌ను ట్రాన్సులేట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇవన్నీ ఒకే ట్యాప్‌తో చేయొచ్చు. సర్కిల్-టు-సెర్చ్ యూజర్లు తమ స్క్రీన్‌పై ఏదైనా సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ ఫీచర్ ఆడియో ఫైల్‌లను టెక్స్ట్‌గా మారుస్తుంది.