Vivo V60 Launch : కొత్త వివో V60 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V60 Launch : కొత్త వివో V60 ఫోన్ లాంచ్ కానుంది. భారత మార్కెట్లో అతి త్వరలో రాబోతుంది. ధర, ఫీచర్ల లీక్ వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo V60 Launch
Vivo V60 Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. వివో V50 స్మార్ట్‌ఫోన్ స్థానంలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. వివో ఇండియా రాబోయే వివో V60 లాంచ్ (Vivo V60 Launch)ను ధృవీకరించింది. ఈ వివో ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి అధికారిక వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
రిపోర్టు ప్రకారం.. వివో V60 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ధర రూ. 37వేల నుంచి రూ. 40వేల మధ్య ఉంటుందని అంచనా. ఆస్పిషస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.
వివో V60 ఫీచర్లు (అంచనా) :
వివో V60 ఫోన్ 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్, 50MP పెరిస్కోప్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6,500mAh బ్యాటరీతో వస్తుందని అంచనా.
వివో డిజైన్‌తో పాటు వివో V60లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కంపెనీ వివో 100x డిజిటల్ జూమ్ కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుందని అంచనా.