Redmi Note 14 SE 5G : ఇది కదా ఫోన్ అంటే.. ట్రిపుల్ కెమెరాలతో రెడ్‌మి నోట్ 14 SE 5G లాంచ్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి..!

Redmi Note 14 SE 5G : ట్రిపుల్ కెమెరాలతో రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ వచ్చేసింది. అతి చౌకైన ధరకే ఇలా కొనేసుకోవచ్చు.

Redmi Note 14 SE 5G : ఇది కదా ఫోన్ అంటే.. ట్రిపుల్ కెమెరాలతో రెడ్‌మి నోట్ 14 SE 5G లాంచ్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి..!

Redmi Note 14 SE 5G

Updated On : July 29, 2025 / 5:48 PM IST

Redmi Note 14 SE 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రెడ్‌మి నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్, 5,110mAh బ్యాటరీతో (Redmi Note 14 SE 5G) వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ రెడ్‌‌మి ఫోన్ 50MP సోనీ LYT-600 సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అమోల్డ్ డిస్‌ప్లే 2,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది.

భారత్‌లో రెడ్‌మి నోట్ 14 SE 5G ధర, లభ్యత :
భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ (6GB + 128GB) ధర రూ. 14,999కు లభ్యమవుతుంది. ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, షావోమీ ఇండియా ఇ-స్టోర్, షావోమీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, అధీకృత పార్టనర్ల ద్వారా అమ్మకానికి ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ క్రిమ్సన్ రెడ్, మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14 SE 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Vivo X100 Price Drop : వివోనా మజాకా.. కొత్త వివో X100పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా SoC ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2.0తో రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 14 SE 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 20MP సెన్సార్ కలిగి ఉంది. డాల్బీ ఆడియో సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది.

రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ 5,110mAh బ్యాటరీ, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. 162.4×75.7×7.99mmతో 190 గ్రాముల బరువు ఉంటుంది.