Vivo X Fold 5 and X200 FE: మార్కెట్లోకి ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో 2 స్మార్ట్‌ఫోన్లు ఒకేసారి వస్తే కొనకుండా ఎలా ఉంటారు?
ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ ‘అల్ట్రా లెవెల్’లో ఉంటుంది. యూనిక్ ఫోన్ కావాలనుకునే వారికి నచ్చుతుంది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో నుంచి సోమవారం రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఒకటి Vivo X Fold 5 నెక్స్ట్-జెనరేషన్ ఫోల్డబుల్ ఫోన్, రెండోది Vivo X200 FE కంపాక్ట్ పవర్‌ఫుల్ డివైస్. కంపెనీ అధికారిక పోర్టల్‌లో ఇప్పటికే కొన్ని టీజర్లు షేర్ చేసింది.
Vivo X Fold 5
అల్ట్రా థిన్, లైట్‌వెయిట్ డిజైన్‌తో ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడానికి వస్తోంది. వెయిట్ కేవలం 217 గ్రాములు. ఫోల్డ్ చేసినపుడు మందం 0.92 సెం.మీ, అన్‌ఫోల్డ్ చేస్తే 0.43 సెం.మీ మాత్రమే ఉంటుంది. 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తోంది. 80W ఫాస్ట్ చార్జింగ్, 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ అదరహో అనేలా ఉన్నాయి. Android 15 సపోర్ట్‌తో Samsung Galaxy Z Fold 7కి గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.
Vivo X200 FE
వివో X200 FE కంపాక్ట్ ఫోన్‌లోనూ అద్భుతమై ఫీచర్లు ఉన్నాయి. ZEISS నుంచి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ ‘అల్ట్రా లెవెల్’లో ఉంటుంది. 6.31-ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్ తో వస్తోంది.
Dimensity 9300+ ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, 90W ఫ్లాష్‌చార్జ్‌తో పర్ఫార్మెన్స్, చార్జింగ్ బాగుంటుంది. IP68/IP69 రేటింగ్ వల్ల వాటర్, డస్ట్ సేఫ్టీ బాగుంటుంది.
X Fold 5 ప్రీమియం, ఫోల్డబుల్, యూనిక్ ఫోన్ కావాలనుకునే వారికి నచ్చుతుంది. X200 FE మంచి కెమెరా, బ్యాటరీ పనితీరు ఉండాలనుకునేవారికి బెటర్. ఈ లాంచ్ ద్వారా ఫోల్డబుల్ సెగ్మెంట్‌తో పాటు కంపాక్ట్ ఫోన్ విభాగంలోనూ Vivo మార్కెట్లో తన పట్టును నిలబెట్టుకోవాలని భావిస్తోంది.