Video: నీళ్లు తెచ్చి ముఖంపై కొట్టండి.. నిద్రొస్తుందా? ఆవలిస్తూ దొరికిపోయిన ఇంగ్లాండ్‌ కెప్టెన్.. రవిశాస్త్రి రియాక్షన్.. నవ్వుల్ నవ్వుల్..

మ్యాచ్ జరుగుతుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుర్చీలో కూర్చుని హాయిగా ఆవలిస్తూ కెమెరాకు చిక్కాడు.

Video: నీళ్లు తెచ్చి ముఖంపై కొట్టండి.. నిద్రొస్తుందా? ఆవలిస్తూ దొరికిపోయిన ఇంగ్లాండ్‌ కెప్టెన్.. రవిశాస్త్రి రియాక్షన్.. నవ్వుల్ నవ్వుల్..

Updated On : July 13, 2025 / 8:32 PM IST

ఇంగ్లాండ్‌-ఇండియా మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ జరుగుతుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుర్చీలో కూర్చుని హాయిగా ఆవలిస్తూ కెమెరాకు చిక్కాడు.

జాక్ క్రాలీ, బెన్ డకెట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాను గుర్తించని స్టోక్స్ రిలాక్స్ అవుతూ, ఆవలిస్తూ కనపడడం నవ్వులు పూయిస్తోంది. దీంతో కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి దీనిపై స్పందిస్తూ.. “మార్నింగ్ బెన్.. తొందరపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

Also Read: రూ.500 నోట్లను ఏటీఎంలలో పెట్టకూడదని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిందా? నిజం ఇదే..

కాగా, మూడో టెస్ట్‌ మ్యాచులో నాలుగో రోజు ఆటలో మరో ఘటన కూడా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత బౌలర్ సిరాజ్ వేసిన బాల్‌ను పుల్‌ షాట్‌ ఆడే యత్నంలో బుమ్రాకు బెన్‌ డకెట్‌ చాలా ఈజీగా క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో బెన్‌ డకెట్‌ ముఖం వద్దకు వెళ్లి సిరాజ్ సింహ గర్జన చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.

నాలుగో రోజు ఆట ఉత్కంఠగా కొనసాగింది. పిచ్ పరిస్థితులు కష్టంగా ఉన్న నేపథ్యంలో 250-300 రన్స్ చేయడానికి కూడా టీమ్‌ కష్టపడాల్సి వస్తోంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387కి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కూడా 387 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌ లో ఇంగ్లాండ్‌ స్కోరు 52 ఓవర్లు ముగిసే సమయానికి 175-6గా ఉంది.