Vivo X100 Series Launch : ఈ నెల 14న వివో ఎక్స్100 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X100 Series Launch : వివో గత నెలలో చైనాలో లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 14న వివో ఎక్స్100, ఎక్స్100 ప్రోలను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Vivo X100 Series Launch : ఈ నెల 14న వివో ఎక్స్100 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X100 and X100 Pro to launch on December 14 globally

Vivo X100 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్100, ఎక్స్100 ప్రోలను నవంబర్ 14న చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచ స్థాయిలో లాంచ్ కానున్నాయి. ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. కొత్తగా లాంచ్ అయిన వివో స్మార్ట్‌ఫోన్‌లు మీడియా టెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Read Also : Vivo S18 Series : ఈ నెల 14న వివో S18 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు చైనా లాంచ్ అయిన సరిగ్గా నెల తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. వివో డివైస్‌లు డిసెంబర్ 14న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో లాంచ్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

వివో ఎక్స్100 ఎక్స్100 ప్రో ధర (అంచనా) :
గత నెలలో చైనాలో లాంచ్ అయిన వివో ఎక్స్100 ధర 3,999 యువాన్లు (సుమారు రూ. 45,600), అయితే వివో ఎక్స్100 ప్రో సిరీస్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ. 57,000) ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వివో ఫోన్ ధర ఇంకా ప్రకటించలేదు. అయితే, చైనాలో చెన్ యే బ్లాక్, స్టార్ ట్రైల్ బ్లూ, సన్‌సెట్ ఆరెంజ్, వైట్ మూన్‌లైట్ అనే 4 కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.

వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో స్పెషిఫికేషన్లు :
వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మోడల్ 6.78-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వివో ఎక్స్100 సోనీ ఐఎమ్ఎక్స్ విసీఎస్ సెన్సార్‌తో 50ఎంపీ ప్రధాన సెన్సార్, జీస్ లెన్స్‌తో కూడిన 64ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది.

Vivo X100 and X100 Pro to launch on December 14 globally

Vivo X100 and X100 Pro launch  

మరోవైపు, వివో ఎక్స్100 ప్రో సోనీ ఐఎమ్ఎక్స్989 లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ జీస్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆకట్టుకునే 4.3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. రెండు డివైజ్‌లలో 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో అద్భుతమైన ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. వివో ఎక్స్100 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 100డబ్ల్యూ ఛార్జర్‌తో వస్తుంది. ఇంతలో ఎక్స్100 ప్రో 5,400ఎంఎహెచ్ బ్యాటరీ, 120డబ్ల్యూ వైర్డు ఛార్జర్‌తో నాచ్‌ని కలిగి ఉంటుంది. ఈ డివైజ్‌లు అత్యుత్తమ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5టీ ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా పొందవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వివో ఎక్స్100 సిరీస్ యూఎస్‌బీ-సి 3.2, వై-ఫై-7, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3తో అన్ని బేస్‌లను కలిగి ఉంది. వివో భారత్ మార్కెట్లో ఎక్స్ 100 సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు.

Read Also : Vivo Y36i Launch : అత్యంత సరసమైన ధరకే వివో Y36i వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!