Vivo X200 FE Launch
Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఇప్పటికే వివో X200, వివో X200 ప్రో లాంచ్ తర్వాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో X200 FE భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం.. ఈ వివో ఫోన్ జూలైలో లాంచ్ అవుతుందని, మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
ఈ వివో ఫోన్ వివో X200 కన్నా తక్కువ ధరకు రానుంది. 50వేల కన్నా తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుందని భావిస్తున్నారు.
కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర రేంజ్ ఇతర వివరాలను రివీల్ చేయలేదు. కానీ, లీక్‌ల ప్రకారం.. వివో X200 FE కొన్ని ముఖ్యమైన ఫీచర్లను రివీల్ చేసింది.
వివో X200 FE స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ వివో ఫోన్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో రానుందని విశ్లేషకుల అంచనా. 6.31-అంగుళాల 1.5K LTPO OLED, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది.
వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ లేదా ఆప్టిమైజ్ చేసిన వెర్షన్ రాబోయే డైమన్షిటీ 9400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు.
ఈ వివో ఫోన్ 6,500mAh బ్యాటరీతో రావొచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది. ఈ వివో ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోనుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 50MPసోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో జైస్-పవర్ ఫుల్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 50MP సెల్ఫీ షూటర్‌తో రావచ్చు.
దుమ్ము, నీటి నిరోధకతకు IP68/69 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, WiFi 6 సపోర్టుతో డ్యూయల్ 4G/5G కనెక్టివిటీ, ఏఐ సీజనల్ పోర్ట్రెయిట్‌లతో సహా ఏఐ ఫీచర్లను కలిగి ఉండవచ్చు.
వివో X200 FE ధర (అంచనా) :
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. వివో X200 FE ధర రూ. 50వేల నుంచి రూ. 60వేల మధ్య ఉంటుంది. వన్‌ప్లస్ 13s ఇతర ఫోన్లకు పోటీగా ఉండవచ్చని చెబుతున్నారు. రాబోయే వివో ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండొచ్చు.