Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో S30 ప్రో మినీ రీబ్రాడెండ్ వెర్షన్ వస్తోందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X200 FE Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో వివో నుంచి X200FEకి బదులుగా వివో S30 ప్రో మినీ రీబ్రాండెడ్ వర్షన్ రిలీజ్ కానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo X200 FE Launch

Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో కొత్త వివో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. గత అక్టోబర్‌లో చైనాలో లాంచ్ తర్వాత ఈ నెలలోనే వివో X200 ప్రో మినీ లాంచ్ అవుతుందని గత నివేదికలు సూచించాయి.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలి? ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ డిటెయిల్స్

అయితే, కొత్త లీక్‌ల ప్రకారం.. వివో ప్రో మినీకి బదులుగా రీబ్రాండెడ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే జూన్ చివరిలో లేదా జూలై ప్రారంభంలో వివో X200 FE ఫోన్ లాంచ్ చేయనుంది. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, Vivo ప్రాంతీయ మార్కెట్లకు సరిపోయేలా మోడల్ ఫోన్లలో మార్పులు చేస్తుందని నివేదికలు పేర్కొన్నాయి.

వివో ప్రో మినీ నుంచి FE వరకు తేడా ఏంటి? :
వివో ఇండియా X200 ప్రో మినీ స్పెసిఫికేషన్లతో అదే ఫోన్ బదులుగా వివో X200 FE రీబ్రాండెడ్ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. కొన్ని ట్రిమ్-డౌన్ ఫీచర్లతో రావచ్చు. ఆసక్తికరంగా, ఈ రాబోయే మోడల్ వివో S30 ప్రో మినీ మాదిరిగా ఉంటుంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ ప్రకారం.. వివో S30 ప్రో మినీ స్పెషిఫికేషన్లు వివో X200 FEకు దగ్గరగా ఉన్నాయి.

వివో ఇండియా యూజర్ల కోసం వివో S30 ప్రో మినీని వివో X200 FEగా రీబ్రాండ్ చేయవచ్చని సూచిస్తుంది. ఆకర్షణీయమైన డిస్‌ప్లే, కెమెరాలు, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.31-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే మాదిరిగా ఉండే అవకాశం ఉంది. స్క్రోలింగ్, పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది.

క్వాలిటీ స్క్రీన్‌తో కాంపాక్ట్ ఫోన్‌ను కోరుకునే కొనుగోలుదారులకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. కెమెరా సెటప్‌లో మార్పులు ఉండొచ్చు. వివో ప్రో మినీ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ మాదిరిగా కాకుండా వివో X200 FE రెండు బ్యాక్ కెమెరాలతో వస్తుందని భావిస్తున్నారు.

ఈ రెండూ 50MP సెన్సార్‌లను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. అందులో టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా మిగిలి ఉంది. వివో కెమెరా సాఫ్ట్‌వేర్ ప్రాసెసర్, ఛార్జింగ్ X200 FE, డైమెన్సిటీ 9300 ప్లస్ వేరియంట్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి చాలు.. జస్ట్ 10 ఏళ్లలో లక్షాధికారి అవ్వొచ్చు..!

ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ కాకపోయినా రోజువారీ టాస్కులతో పాటు లిమిటెడ్ గేమింగ్‌ ఆడొచ్చు. బ్యాటరీ కెపాసిటీ వివరాలు రివీల్ చేయలేదు. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని కూడా చెప్పవచ్చు.
భారత మార్కెట్లో ధర, లభ్యత విషయానికి వస్తే.. వివో X200 సిరీస్ రూ. 65,999 నుంచి ప్రారంభం కానుంది. వివో X200 FE సరసమైన ధరకే లభించవచ్చు. లీక్‌లు నిజమైతే.. వివో ఫోన్ వచ్చే జూలైలో లాంచ్ చేయనుంది. ధర వివరాలు ఇంకా తెలియదు.