Vivo X200 Series First Sale : వివో X200 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర, ఆఫర్లు వివరాలివే..!
Vivo X200 Series First Sale : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రెండు ఫోన్లు ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు అమెజాన్, వివో ఇ-స్టోర్లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

Vivo X200 Series First Sale
Vivo X200 Series First Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ ఫోన్లలో వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రెండు ఫోన్లు ఫస్ట్ సేల్ మొదలైంది. డిసెంబర్ 12న లాంచ్ అయిన ఈ రెండు ఫోన్లు ఇప్పుడు అమెజాన్, వివో ఇ-స్టోర్లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 65,999 ప్రారంభ ధర వద్ద ఈ సిరీస్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ఈ సిరీస్ ఫోన్లలో ఫ్లాగ్షిప్ మీడియాటెక్ చిప్‌సెట్‌ను అమర్చారు. వినియోగదారులు ఆశించే హై-ఎండ్ స్పెషిఫికేషన్లను అందిస్తుంది. వివో ఎక్స్200 సిరీస్ ఫోన్ కొనే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటో ఓసారి లుక్కేయండి.
వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో ధర, ఆఫర్లు :
వివో ఎక్స్200 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 65,999, 16జీబీ + 512జీబీ వేరియంట్‌కు ధర రూ. 71,999 నుంచి ప్రారంభమవుతుంది. వివో ఎక్స్200 ప్రో ధర 16జీబీ ర్యామ్ + 512జీబీ మోడల్‌కు రూ. 94,999కు అందిస్తోంది. ఈ ఫోన్లు అమెజాన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు కంపెనీ కొన్ని ఆసక్తికరమైన బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది.
నెలకు రూ. 2750తో ఈజీ ఈఎంఐపై 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికతో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకింగ్ పార్టనర్లతో 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లేదా 10 శాతం వరకు వి-అప్‌గ్రేడ్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 749లతో ఫ్రీ ఒక ఏడాది అదనపు ఎక్స్టెండెడ్ వారంటీని, 60 శాతం వరకు హామీ ఇచ్చిన క్యాష్‌బ్యాక్‌ను పొందండి. అయితే, జియో యూజర్లు 6 నెలల పాటు 10 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. వి-షీల్డ్ రక్షణపై 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
వివో ఎక్స్200 సిరీస్ : స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వివో ఎక్స్200 6.67-అంగుళాల 10-బిట్ ఓఎల్ఈడీ ఎల్టీపీఎస్ క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, 4,500 నిట్ల గరిష్ట ప్రకాశం వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
వివో రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను కలిగి ఉంది. క్యాప్టివేటింగ్ నేచురల్ గ్రీన్, టైమ్‌లెస్ కాస్మోస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఫోన్ అందుబాటులో ఉంది. ప్రామాణిక వివో ఎక్స్200 ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, సాలిడ్ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
వివో ఎక్స్200ప్రో స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అదే డిస్ప్లేను అందిస్తుంది. అయితే, 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, స్లిమ్మర్ 1.63ఎమ్ఎమ్ బెజెల్స్‌తో ఎల్టీపీఓ ప్యానెల్‌తో సహా గుర్తించిన అప్గ్రేడ్లను కలిగి ఉంది.
టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే 2 ఆకర్షణీయమైన షేడ్స్‌లో అందుబాటులో ఉంది. వివో ప్రో వేరియంట్లో 200ఎంపీ జీస్ ఏపీఓ టెలిఫోటో సెన్సార్ అమర్చారు. వివో వి3+ ఇమేజింగ్ చిప్‌కు సపోర్టు అందిస్తుంది. 4కె హెచ్డీఆర్ సినిమాటిక్ పోర్ట్రెయిట్, 60ఎఫ్‌పీఎస్ వద్ద 10-బిట్ లాగ్ వీడియో రికార్డింగ్ వంటి అడ్వాన్స్డ్ వీడియో ఫీచర్లను అందిస్తుంది.
అదనంగా, వివో ఎక్స్200 ప్రో అదే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ ద్వారా ఆధారితంగా 3ఎన్ఎమ్ ప్రాసెస్‌పై పనిచేస్తాయి. చిప్‌లో 3.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో కార్టెక్స్-X925 పర్ఫార్మెన్స్ కోర్ ఉంది. రెండు మోడళ్లలో టాప్-టైర్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి.